బీస్ట్ మోడ్ లో నాగార్జున..అంచనాలు పెంచేస్తున్న”ది ఘోస్ట్” క్రేజీ గ్లింప్స్.!

ఈ ఏడాది అయితే అక్కినేని ఫ్యాన్స్ కి కాస్త హ్యాపీ ఇయర్ అనే చెప్పాలి. స్టార్టింగ్ లోనే అదిరే హిట్స్ తో అలరించిన అక్కినేని ఫ్యామిలీ లేటెస్ట్ గా అక్కినేని నాగ చైతన్య అందుకున్న “థాంక్ యూ” డిజాస్టర్ తో మాత్రం వెనక్కి పడింది. అయితే ఇదిలా ఉండగా ఈ డిజాస్టర్ ని ధీటైన సమాధానంలా అయితే ఈ ఏడాది రెండు భారీ సినిమాలు కూడా ఉన్నాయి.

మరి ఈ సినిమాల్లో అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటించిన “ఏజెంట్” కాగా మరొకటి కింగ్ నాగార్జున నటించిన ఇంటెన్స్ ఏక్షన్ థ్రిల్లర్ సినిమా తో “ది ఘోస్ట్” కూడా ఒకటి. మరి రెండు సినిమాలు కూడా ఖచ్చితంగా హిట్ అవుతాయి అని అంతా అనుకుంటున్నారు.

అయితే లేటెస్ట్ గా నాగ్ సినిమా నుంచి చిత్ర బృందం సాలిడ్ గ్లింప్స్ ని అయితే రిలీజ్ చేసారు. మరి ఇది రిలీజ్ చేసే వరకు అయితే ఈ లెవెల్లో ఉంటుంది అని ఎవరు అనుకోని ఉండకపోవచ్చు. మరి ఈ వీడియోలో అయితే నాగార్జున ఫుల్ బీస్ట్ మోడ్ లో కనిపించడమే కాకుండా చాలా వైలెంట్ గా కూడా కనిపిస్తున్నాడు.

బాగా చూస్తే మొన్న హిట్ “విక్రమ్” తరహా లోనే ఒక క్రేజీ ఏక్షన్ ఫీస్ట్ ఈ సినిమాలో ఉండేలా కనిపిస్తుంది. మొత్తానికి అయితే దర్శకుడు ప్రవీణ్ సత్తారు మాత్రం నాగార్జునని చాల కొత్తగా ప్రెజెంట్ చేసాడు. ఇంకా ఈ సినిమాలో హాట్ బ్యూటీ సోనాల్ చౌహన్ కాజల్ ని రీప్లేస్ చేయగా మార్క్ కె రాబిన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే నార్త్ స్టార్ సినిమాస్ మరియు శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి వారు నిర్మాణం వహించారు. 
The Ghost - Tamahagane Promo | Akkineni Nagarjuna | Praveen Sattaru | Bharatt - Saurabh