“బిగ్ బాస్” గురించి నాగార్జున ఏమన్నాడంటే..?

“బిగ్ బాస్” గురించి నాగార్జున ఏమన్నాడంటే..?

లక్షలాదిమంది ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న “బిగ్ బాస్ ” రియాలిటీ షో స్టార్ మాలో ఈరోజు రాత్రి 9. 00 గంటలకు ప్రారంభమైంది . ఈరోజు కోసమే చాలామంది ఎదురు చూస్తున్నారు . ఈ షో కు ముందు నాగార్జున బిగ్ బోస్ హౌస్ లో ప్రవేశించడం ఎంతో త్రిల్లింగ్ గా ఉందని అన్నారు . హౌస్ లో తిరుగుతూ , వాటిని పరిచయం చేస్తూ నాగార్జున మహా సంతోషంగా కనిపించారు . బిగ్ బాస్ హౌస్ లో వివిధ మనస్తత్వాలు కలిగిన వారు 100 రోజులపాటు గడిపే అరుదైన షో ఇది , ఈ షో అంటే తనకి ఎందుకు అంత ఇస్తామంటే … తమ తండ్రి అక్కినేని నాగేశ్వర రావు గుర్తుకు వస్తున్నాడని చెప్పారు .

“మనుషులు ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించినా , ఎంత ఎత్తుకు ఎదిగినా .. బంధాలు … అనుబంధాలు లేకపోతే ఆ జీవితం నిస్సారంగా గడిచిపోతుంది . అందుకే మాది అతి పెద్ద కుటుంబం . మా కుటుంబలో 30 మంది సభ్యులం వున్నాము . అందరం ప్రతి ఆదివారం నాన్న గారి ఇంట్లో కలిసేవాళ్ళం ..భోజనం తో పాటు ఎన్నో కబుర్లు చెప్పుకుకేవాళ్ళం , ఆప్యాయంగా మాట్లాడుకునేవాళ్ళం … నాన్న పోయినా , నాన్న చూపించిన మార్గంలోనే ప్రయాణిస్తున్నాం .. థాంక్ యు నాన్నా ” అంటూ నాగార్జున ఉద్వేగంగా మాట్లాడారు .