మెగా బ్రదర్ నాగబాబుకు స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ అంటే ప్రత్యేకమైన అభిమానం. బన్నీకి కూడా నాగబాబు అంటే ఎంతో మక్కువ చూపిస్తాడు. చిరంజీవిని ఏమైనా అంటే ఊరుకోని తత్త్వమే నాగబాబులో బన్నీకి బాగా నచ్చినట్టుంది. ఏది ఏమైనా సందర్భం వచ్చిన ప్రతీసారి నాగబాబుపై ఉన్న ప్రేమను బన్నీ, బన్నీపై ఉన్న ప్రేమను నాగబాబు ప్రదర్శిస్తూనే ఉంటారు. నాగబాబు బర్త్ డే సందర్భంగా తాజాగా బన్నీ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తుల్లో ఒకరు.. ఎంతో నిజాయితీ, జెన్యూన్ అయినా నాగబాబాయ్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఇలాంటివి మరెన్నో జరుపుకోవాలని అంటూ బన్నీ ట్వీట్ చేశాడు. ఇక బన్నీ ట్వీట్‌కు రిప్లై ఇచ్చిన నాగబాబు అదిరిపోయే అప్డేట్ ఒకటి ఇచ్చాడు. అది చూసిన ఫ్యాన్స్‌కు సంతోషాలకు ఆకాశమే హద్దుగా మారాయి. ఇంతకీ ఆ విషయం ఏంటంటే పుష్ప చిత్రంపై నాగబాబు చేసిన కామెంట్స్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. అదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.
థాంక్యూ బన్నీ.. వెండితెరపై పుష్పగా బన్నీ సృస్టించే అల్లకల్లోలాన్ని చూసేందుకు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను అంటూ అదిరిపోయే ట్వీట్ చేశాడు. అయితే ఆ ట్వీట్ మొత్తంలో అల్లకల్లోలం అనే పదం మాత్రం ట్రెండ్ అవుతోంది. అసలే సుకుమార్ మంచి కాకమీదున్నాడు. రంగస్థలం తరువాత లాంగ్ గ్యాప్ తీసుకుని పుష్పతో రాబోతోన్నాడు. కరోనా లాక్ డౌన్ వల్ల సినిమా షూటింగ్ ఆలస్యమవుతూ వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ షూటింగ్‌కు రెడీ అవుతోందని తెలుస్తోంది.