(ధ్యాన్)
ఐరా క్రియేషన్స్ అని సొంతంగా ఓ సంస్థను స్టార్ట్ చేసి దాని మీద సినిమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు నాగశౌర్య. వాళ్ల తొలి ప్రయత్నం చలో సక్సెస్ అయింది. రెండో సినిమా @నర్తనశాల విడుదలకు సిద్ధంగా ఉంది. అప్పుడే వాళ్లు మూడో సినిమాను కూడా లైన్‌లోకి తీసుకొచ్చారు. మూడో సినిమా శేఖర్ కమ్ముల కాంపౌండ్‌లో పనిచేసిన తేజ అనే కుర్రాడితో ఉంటుంది. ఫారిన్‌లో దర్శకత్వంలో కోర్సులు చేశాడు తేజ. తాజాగా ఆయన శేఖర్ కమ్ముల దగ్గర అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. అతను చెప్పిన ఫ్రెష్ స్టోరీ శౌర్యకు బాగా నచ్చిందట. సో హోమ్ బ్యానర్‌లోనే సినిమా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సినిమాలో శౌర్య గణపతి అనే పాత్రలో కనిపిస్తారట. కాస్త మాస్‌గానూ ఉంటుందట. అందుకే సినిమా గణ అనే టైటిల్‌ను పెట్టినట్టు సమాచారం. సో ఇప్పుడు బ్యానర్ పేరు ఐరా.. సినిమా పేరు గణ అన్నమాట.