అక్కినేని బుల్లోడి థియేట్రిక‌ల్ శాటిలైట్ రేంజ్

అక్కినేని బుల్లోడు నాగ‌చైత‌న్య బిజినెస్ రేంజ్ ఎంత‌? అంటే 25 కోట్ల నుంచి 30 కోట్ల రేంజు ఉంటుంద‌ని ట్రేడ్ విశ్లేషిస్తుంది. ఆ రేంజులోనే అత‌డు న‌టించిన గ‌త బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాలు వ‌సూలు చేశాయి. అందుకే ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలోని ల‌వ్ స్టోరికి అది పెద్ద ప్ల‌స్ గా మారింది. తాజాగా చైతూ ల‌వ్ స్టోరి బిజినెస్ రేంజ్ రివీలైంది.

ల‌వ్ స్టోరి మూవీ నాన్ థియేట్రిక‌ల్ బిజినెస్ 16కోట్లకు డీల్ కుదిరింది. అలాగే డిజిట‌ల్ రైట్స్ ని ఆహా ప్ర‌తినిధులు 6.3కోట్లకు లాక్ చేశార‌ట‌. హిందీ డ‌బ్బింగ్ రైట్స్ కోసం 4కోట్లు .. శాటిలైట్ కోసం 5.7 కోట్లు ద‌క్క‌నున్నాయి. అలాగే శాటిలైట్ రైట్స్ ని `మా`టీవీ ద‌క్కించుకుంది. ద‌స‌రా రిలీజ్ ని ఖాయం చేసుకున్నార‌ట‌.

క‌మ్ముల అంటే సెన్సిబుల్ చిత్రాల ద‌ర్శ‌కుడిగా ఐడెంటిటీ ఉంది. ఇక ఈ మూవీకి సాయి ప‌ల్ల‌వి ప్ర‌తిభ ప్ర‌ధాన అస్సెట్ కానుంది. ఇందులో చైత‌న్య నైజాం యాస‌లో కొత్త‌గా ట్రై చేస్తుండ‌డం ఆస‌క్తిని పెంచుతోంది. ఇక చైతూ న‌టించిన మ‌జిలీ, వెంకీ మామ స‌క్సెస్ కావ‌డంతో అత‌డికి ఈ రేంజు బిజినెస్ సాగింద‌ని అర్థ‌మ‌వుతోంది.