చైతు సమంత కొత్త సినిమా ప్రారంభం..

మోస్ట్ ఏవైటెడ్ కాంబినేషన్ నాగచైతన్య-సమంత జంటగా నూతన చిత్ర ప్రారంభోత్సవం ఇవాళ జరిగింది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి-హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి “నిన్ను కోరి”తో ప్రేక్షకులను విశేషంగా అలరించిన శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు.  ప్రస్తుతానికి చిత్రం పేరు ఎన్ సి 17.

హైద్రాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ చిత్ర ప్రారంభోత్సవం లాంఛనంగా జరిగింది. నాగార్జున ముఖ్య అతిధిగా విచ్చేసి బౌండెడ్ స్క్రిప్ట్ ను దర్శకుడు శివ నిర్వాణకు అందించారు. నాగచైతన్య-సమంత వివాహం అనంతరం నటిస్తున్న చిత్రమిదే కావడం విశేషం.

2010 ఏమ్మాయ చేశావే చిత్ర చైతు సమంతాల లవ్ స్టొరీ మొదలయిన సంగతి తెలిసిందే. అపుడే వారిద్ధరి నుంచి ఆటో నగర్ శివ, మనం చిత్రాలు వచ్చాయి. తర్వాత వారికి పెళ్లయింది. అభిమానులకు సెల్ఫీలు, టూర్ పిక్చర్లు తప్ప సినిమాలు రాలేదు. ఈ ఎదురుచూపుల్లో  ఉన్న  చైసమ్ (చైతూ సమంతల సమిష్టి పేరు) ఇపుడు శివ శుభవార్త అందిస్తున్నారు.

దివ్యాన్ష కౌశిక్ రెండో హీరోయిన్ గా నటిస్తుండగా.. శ్రీనివాస్ అవసరాల, రావురమేష్, పోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఆగస్ట్ రెండోవారం నుంచి మొదలవుతుంది.

గోపీసుందర్ సంగీత సారధ్యం వహించనున్న ఈ చిత్ర ప్రారంభోత్సవ వేడుకలో మైత్రీ మూవీ మేకర్స్ అధినేత నిర్మాత నవీన్ యెర్నేని, రచయిత కోన వెంకట్ పాల్గొన్నారు.

 

తారాగణం:

నాగచైతన్య, సమంత, దివ్యాన్ష కౌశిక్, రావురమేష్, శ్రీనివాస్ అవసరాల, పోసాని కృష్ణమురళి, శత్రు, రాజశ్రీ నాయర్ తదితరులు..

 

సాంకేతికవర్గం:

రచన-దర్శకత్వం: శివ నిర్వాణ

నిర్మాతలు: సాహు గారపాటి-హరీష్ పెద్ది

నిర్మాణ సంస్థ: షైన్ స్క్రీన్స్

సంగీతం: గోపీ సుందర్

ఛాయాగ్రహణం: విష్ణు శర్మ

ప్రోడ్కషన్ డిజైనర్: సాహి సురేష్

కూర్పు: ప్రవీణ్ పూడి

కో-డైరెక్టర్: లక్ష్మణ్ మూసులూరి

లైన్ ప్రొడ్యూసర్: నాగమోహన్

పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్