పవన్ కల్యాణ్ రాజకీయ జీవితం వేరు..సినిమా జీవితంవేరు. సినిమాల పరంగా ఆయన్ను అభిమానించే వారు అన్ని పార్టీల్లోనూ ఉన్నారు. వాళ్లంతా ఆయన సినిమాలు మానేసి పూర్తిగా రాజకీయాలకే జీవితం అంకితం చేయటం బాధకలిగించే విషయంగా ఫీలయ్యారు. అయితే ఆయన మళ్లీ సినిమా చేస్తారు అనే ఆశ ని ప్రముఖ నిర్మాణ సంస్ద మైత్రీ మూవీస్ వారు ఇస్తున్నారు. తాము గతంలో ఆయనతో సినిమా చేయటానికి ఇచ్చిన అడ్వాన్స్ ని వెనక్కి తీసుకోలేదని, ఎప్పుడు ఆయన సినిమా అంటే అప్పుడు రెడీ అంటూ తేల్చేసారు. మైత్రి పార్ట్ నర్స్ నవీన్-రవి శంకర్-మోహన్ ఈ విషయమై క్లారిటీ ఇవ్వటం అందరికీ ఆనందం కలిగిస్తోంది.
కాటమరాయుడు తర్వాత పవన్ ..ఇక నేను సినిమాలు చేసేదిలేదు పూర్తిగా జనసేనకే అంకితమైన ప్రజా సేవ లో గడుపుతాను అన్నారు. అన్న ప్రకారమే ఎప్పుడూ జనాల్లో ఉంటున్నారు. దాంతో అప్పట్లో కందిరీగ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం చేద్దామని ..అడ్వాన్స్ ఇచ్చారు. ఆయన రాజకీయాల్లోకి వెళ్లిపోవటంతో అంతా ..వెనక్కి పవన్ అడ్వాన్స్ ఇచ్చేస్తున్నారనే ప్రచారం జరిగింది. కానీ మైత్రీ మూవీస్ వాళ్లు ఈ రోజు సవ్యసాచి ప్రమోషన్ లో మాట్లాడుతూ ఈ విషయమై క్లారిటీ ఇచ్చారు. దాంతో పవన్ మళ్ళీ సినిమా చేసే ఉద్దేశ్యం లేకపోతే ఎందుకు అడ్వాన్స్ ఇవ్వరు అనే లాజిక్ అందరిలో మొదలైంది.
శైలజారెడ్డి అల్లుడు యావరేజ్ అనిపించుకోవటంతో నాగచైతన్య సవ్యసాచి తో ఎలాగైనా హిట్ కొట్టాలనే ఉద్దేశ్యంలో ఉన్నాడు మైత్రీ మూవీస్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం నవంబర్ 2 తేదీన విడుదలకు సిద్దమవుతున్నది. నాగచైతన్య సరసన నిధి అగర్వాల్ నటిస్తున్న ఈ సినిమాకు కార్తీకేయ, ప్రేమమ్ చిత్రాల దర్శకుడు చందూ మొండేటి దర్శకుడు.