బన్నీతో అదిరే బ్యాక్ డ్రాప్ ప్లాన్ చేస్తున్న తమిళ్ దర్శకుడు.!

ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (బన్నీ) తన కెరీర్ లో మొట్ట మొదటి పాన్ ఇండియన్ సినిమా తన మరో హ్యాట్రిక్ దర్శకుడు సుకుమార్ తో చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్ర డిసెంబర్ 17 అని ఫిక్స్ కూడా అయ్యిపోయింది.

మరి ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత కూడా బన్నీ అదిరే లైనప్ ని సెట్ చేస్తున్నాడని టాక్ ఉంది. పలువురు స్టార్ దర్శకులతో సినిమాలు ఓకే చేస్తున్న క్రమంలో తమిళ స్టార్ దర్శకుడు ఏ ఆర్ మురుగ దాస్ తో ఓ సినిమా ఉందని ఎప్పుడు నుంచో బజ్ ఉంది.

ఎట్టకేలకు ఈ భారీ సినిమా మొదలు కానుందట. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ అంశం ఏమిటంటే ఈ సినిమా ఇప్పటి వరకు టాలీవుడ్ లో అతి తక్కువగా టచ్ చేసిన బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని తెలుస్తుంది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా ఉంటుందట. బన్నీ ఈ తరహా సినిమాలో అనేది కాస్త ఆసక్తిగానే అనిపిస్తుంది. మరి వాస్తవంగా ఎంతమేర నిజమవుతుందో వేచి చూడాల్సిందే.