బిగ్ బాస్ లో ఆ విధంగా ఎలిమినేట్ అయిన మొదటి కంటెస్టెంట్ అవినాష్ !

అవినాష్ … జబర్దస్త్ షో ద్వారా బెస్ట్ కమెడియన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ ఫేం తో బిగెస్ట్ రియాలిటీ షో ఇన్ ది వరల్డ్ .. బిగ్ బాస్ సీజన్ 4 లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చాడు.

Bigg Boss 4 Telugu week 10 Mutton become waste By Avinash Mistake

అవినాష్ రాకముందు .. అవినాష్ వచ్చిన తర్వాత అన్నంతలా షో మారింది అని చెప్పడం లో అతిశయోక్తి లేదు. చాలా రోజుల పాటు హౌస్‌లో ఉన్న అతడు.. 13 వ వారం ఎలిమినేట్ అయిపోయాడు. అయితే, అవినాష్ అరుదైన ఓ రికార్డ్ సాధించాడు.

మూడో వారంలో జోకర్ గెటప్ ‌తో హౌస్ ‌లోకి ప్రవేశించిన అతడు.. పరిచయ వీడియోతోనే అంచనాలు పెంచేశాడు. ఇంట్లోకి అడుగు పెట్టినప్పటి నుంచే తన మార్క్ చూపించేందుకు ప్రయత్నించాడు. తరచూ ఏదో ఒక గొడవతో మూసగా సాగిపోతోన్న బిగ్ బాస్ షోను తన రాకతో మార్చేశాడు అవినాష్. హౌస్‌ మేట్లు అందరినీ ఇమిటేట్ చేయడంతో పాటు వీకెండ్ ఎపిసోడ్స్ ‌లో అద్భుతమైన టైమింగ్‌ తో పంచులు పేలుస్తూ సమంత, నాగార్జున నుంచి బెస్ట్ ఎంటర్ ‌టైనర్ అని పేరు సంపాదించుకున్నాడు.

ఎక్కువగా అతడు ఆరియానా గ్లోరీతో చెట్టాపట్టాలేసుకుని తిరిగే వాడు. ఈ క్రమంలోనే ఆమెను పడేయడానికి ఎన్నో ప్రయత్నాలు సాగించేవాడు. దీంతో వీళ్లిద్దరి మధ్య ప్రేమాయణం సాగుతుందని ప్రచారం జరిగింది. ఇంట్లో ఎంతో సరదాగా ఉంటూ అందరినీ నవ్విస్తూ ఉండే అవినాష్.. నామినేషన్స్ టాస్కులో మాత్రం కొత్తగా కనిపించేవాడు. బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన అవినాష్ పేరిట ఓ రికార్డు నమోదైంది. గత వారం ఎవిక్షన్ ఫ్రీ పాస్ వాడుకున్న అతడు.. ఈ వారం ఇంటి నుంచి వెళ్లిపోక తప్పలేదు. ఇలా ఒకే కంటెస్టెంట్ ప్రేక్షకుల ఓట్ల ఆధారంగా రెండు సార్లు ఎలిమినేట్ అయినట్లు ప్రకటించడం బిగ్ బాస్ చరిత్రలో ఇదే మొదటిసారి అని చెప్తున్నారు.