సుశాంత్ సింగ్ ఆత్మ‌హ‌త్య‌పై సినిమా ఇదే

టిక్ టాక్ స్టార్ సచిన్ తివారీ, విజయ్ శేఖర్ గుప్తా నిర్మించిన `సూసైడ్ ఆర్ మర్డర్` ఫ‌స్ట్ లుక్ రివీలైంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ‌హ‌త్య‌..  జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందుతున్నా.. ఇది కేవ‌లం బాలీవుడ్ లో వెలుప‌లి స్టార్ల క‌ష్టాల‌పై తీసిన సినిమా. విజయ్ శేఖర్ గుప్తా ఈ సినిమా మొదటి పోస్టర్ ను షేర్ చేయడంతో పాటు సోషల్ మీడియాలో ఈ ప్రకటన చేశారు. “ఒక చిన్న పట్టణానికి చెందిన బాలుడు సినీ పరిశ్రమలో షైనింగ్ స్టార్ అయ్యాడు. ఇది అతని ప్రయాణం. # సూసైడ్ ఆర్ మ‌ర్డ‌ర్ లో స‌చిన్ తివారీని క‌థానాయ‌కుడిగా పరిచయం చేస్తున్నారు అని తెలిపారు.

“సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య మరణం మనందరికీ షాక్ ఇచ్చింది. కానీ ఇదేమీ ఊహించ‌నంత‌ కొత్తది కాదు. ఇక్కడ పెద్ద స్టార్ గా ఎద‌గాల‌నే వారి కలలు ఇలానే క‌ల్ల‌లు అయిపోతున్నాయి. ప‌రిశ్ర‌మ వెలుప‌ల వాళ్లు.. చాలా మంది నటులు ఆశించిన‌ది పొందలేకపోతున్నారు. చాలామంది ఈ మార్గంలో వెళుతుంటారు. మరికొందరు తమ జీవితమంతా కష్టపడుతూ ఉంటారు. కాబట్టి.. బాలీవుడ్ పోరాటంలో గాడ్ ఫాదర్స్ లేని చిన్న పట్టణాల నటులు ఎలా ఉన్నారో చెప్పాలనుకుంటున్నాం“ అని తెలిపారు.

సచిన్ తివారీ ఫ‌స్ట్ లుక్ ఫోటోలు.. వీడియోలు రిలీజ్ చేయ‌గా.. వాటిలో సుశాంత్ సింగ్ ‌తో పోలి క‌నిపించ‌డం ప్ర‌స్తుతం హాట్ టాపిక్ గా మారింది.