ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలపై మోహన్ బాబు “చదరంగం “

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలపై మోహన్ బాబు “చదరంగం “

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన రాజకీయ ఘటనల నేపధ్యలో మంచు విష్ణు “చదరంగం ” పేరుతో ఒక వెబ్ సిరీస్ ను రూపొందిస్తున్నాడు . ఇందులో శ్రీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు . మోహన్ బాబు సాయిబాబా భక్తుడు అందుకే గురుపూర్ణిమ రోజున ఈ “చదరంగం ” సిరీస్ ను లాంఛనంగా ప్రారంభించారు . విష్ణు తాను తయారు చేసుకున్న కథ అని , అమ్మ నిర్మల, నాన్న మోహన్ బాబు ఆశీస్సులతో దీనిని మొదలు పెడుతున్నామని తన ట్విట్టర్లో పేర్కొన్నాడు . అయితే పేరుకే విష్ణు నిర్మాత , ఈ రాజకీయ వెబ్ సిరీస్ నిర్మాణం వెనుక మోహన్ బాబు ఉన్నాడనేది స్పష్టం .

మంచు మోహన్ బాబు కు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎన్ . చంద్ర బాబు నాయుడుకు దూరపు చుట్టరికం వుంది . అన్న ఎన్టీఆర్ స్పూర్తితో మోహన్ బాబు తెలుగు దేశం పార్టీలో చేరాడు . ఆ తరువాత ఎన్టీఆర్ నుంచి పార్టీని స్వాధీనం చేసుకున్న చంద్ర బాబు ముఖ్యమంత్రి అయ్యారు . అప్పుడు మోహన్ బాబు చంద్ర బాబు కలసి నడిచాడు . అంతేకాదు చంద్ర బాబు స్థాపించిన “హెరిటేజ్ ” సంస్థలో మోహన్ బాబు పెట్టుబడులు కూడా పెట్టాడు . అయితే వీరిద్దరికీ ఎక్కడ సమస్య వచ్చిందో తెలియదు , మోహన్ బాబు తెలుగు దేశం పార్టీకి గుడ్ బై చెప్పారు .

ఆ తరువాత 2009లో రాజశేఖర్ రెడ్డి బంధువుల అమ్మాయి విరానికా రెడ్డి తో తన కుమారుడు విష్ణు వివాహం జరిపించాడు . అప్పటి నుంచి రెండు కుటుంబాల మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి . రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో మోహన్ బాబు , విష్ణు చేరాడు .

20019 ఎన్నికల ముందు చంద్ర బాబు పై మోహన్ బాబు తీవ్రమైన ఆరోపణలు చేశాడు . జగన్ మోహన్ రెడ్డి పార్టీ తరుపున రాయల సీమలో మోహన్ బాబు , విష్ణు ప్రచారం కూడా చేశారు . జగన్ మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు .

అయితే రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తరువాత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది . తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు … ఆమరణ నిరాహార దీక్షతో … రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది . ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఇవ్వాల్చిన అనివార్య పరిస్థితులు కేంద్రానికి వచ్చాయి అదికూడా తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు , ప్రతి పక్ష నాయకుడు చంద్ర బాబు నాయుడు తాము తెలంగాకు వ్యతిరేకం కాదని లేఖ ఇచ్చాడు . సోనియా గాంధీ ఈ లేఖ ను చూపించి ప్రత్యేక తెలంగాణ ఇస్తున్నట్టు ప్రకటించారు .

నిజానికి తెలంగాణా ఉద్యమం సాగుతున్న రోజుల్లో చంద్ర బాబు రెండు కళ్ళ సిద్ధాంతంతో మౌనం పాటించాడు . ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం విడిపోవడానికి చంద్ర బాబు నాయుడే ప్రధాన కారణమని చాలా మంది నమ్ముతారు .
బహుశ ఈ రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని చంద్ర బాబును రాజకీయంగా మరింత దెబ్బతీయడానికే మోహన్ బాబు “చదరంగం ” నిర్మిస్తున్నట్టు తెలుస్తుంది . సీరియస్ ద్వారా శ్రీకాంత్ టెలివిషన్ రంగంలో కి అడుగుపెడుతున్నారు . జీ టీవీ ద్వారా చదరంగం ప్రసారం అవుతుంది .