విల‌న్‌గా క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబు కింగ్‌?

                                                                              (ధ్యాన్)

600 ల‌కు పైగా సినిమాల్లో న‌టించి మెప్పించిన విల‌క్ష‌ణ న‌టుడు క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబు గురించి ప్ర‌త్యేక ప్రస్తావ‌న అక్క‌ర్లేదు. ఈ మ‌ధ్య అయ‌న పెద్ద‌గా సినిమాల్లో న‌టించ‌డం లేదు. ఆయ‌న న‌టించిన గ‌త చిత్రం గాయ‌త్రి. అందులో ఆయ‌నే హీరోగా.. విల‌న్‌గా న‌టించి ఆక‌ట్టుకున్నారు. అయితే విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం మోహ‌న్‌బాబు మ‌రోసారి విల‌న్‌గా న‌టించ‌బోతున్నార‌ట‌.. ఇందులో మ‌రో ట్విస్ట్ ఏంటంటే.. అది కూడా త‌మిళంలో. ఇప్ప‌టి వ‌ర‌కు మోహ‌న్‌బాబు త‌మిళంలో న‌టించ‌లేదు. ఆయ‌న తొలిసారి న‌టిస్తున్న త‌మిళ చిత్ర‌మిదే అవుతుంది. రెండో ట్విస్ట్ ఏంటంటే.. సినిమాలో హీరో ఎవ‌రో తెలుసా?… సూర్య‌. తెలుగు, త‌మిళంలో స‌క్సెస్‌ఫుల్ మార్కెట్ ఉన్న ఈ హీరో త‌దుప‌రి సుధా కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌బోతున్నారు. ఈ సినిమాలోనే మోహ‌న్‌బాబు విల‌న్‌గా న‌టించే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. రీసెంట్‌టైమ్స్‌లో మోహ‌న్‌బాబు ఫ్యామిలీకి.. సూర్య ఫ్యామిలీకి స‌త్సంబంధాలు నెల‌కొన్నాయి. ఈ నేప‌థ్యంలో … ఇన్నేళ్ల త‌ర్వాత మోహ‌న్‌బాబు త‌మిళంలో విల‌న్‌గా చేయ‌డం అంటే సెన్సేష‌నే క‌దా..