కొన్ని మాటలు వింటూంటే చాలా అతిగా అనిపిస్తుంది. లేకపోతే తనను నటనలో డామినేట్ చేస్తున్నాడని సూపర్ స్టార్ మహేష్ బాబు… ఓ కమిడియన్ సీన్స్ కట్ చేయించాడా..వింటానికే నవ్వు వస్తోంది కదూ. అవును ..ఈ కథనం చదివితే మీరూ అదే అంటారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో కమర్షియల్ గానూ,సందేశాల పరంగానూ బెస్ట్ గా నిలిచిన చిత్రం ‘భరత్ అనే నేను’ . కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సందేశాత్మక చిత్రం లో నటుడు రాహుల్ రామకృష్ణకు ఒక మంచి క్యారక్టర్ దక్కింది. రాయలసీమలోని ఒక వెనకబడిన ప్రాంతానికి చెందిన కుర్రాడిగా ఆయన కనిపించారు. పేద కుటుంబంలో పుట్టి సీఎం సాయంతో ఎమ్మెల్యే అవటం ఈ సినిమాలో హైలెట్ సీన్స్ లో ఒకటి.
అయితే ఈ సినిమాలో రాహుల్ రామకృష్ణ పాత్ర లెంగ్త్ ఇంకా ఉంటుందట. కొన్ని సీన్స్ ను స్వయంగా మహేష్ బాబు తీయించేశారట. రాహుల్ నటనలో తనను డామినేట్ చేసుస్తున్నాడని భయపడి మహేష్ ఈ పని చేశారట. ఈ విషయాన్ని స్వయంగా రాహుల్ తనతో చెప్పినట్లు ‘మిఠాయి’ చిత్ర దర్శకుడు ప్రశాంత్ కుమార్ తాజాగా వెల్లడించి షాక్ ఇచ్చారు.
లాస్ట్ ఇయిర్ రాహుల్, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో ‘మిఠాయి’ అనే డార్క్ కామెడీ ఫిల్మ్‌ను ప్రశాంత్ కుమార్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. పోస్టర్లు, టీజర్, ట్రైలర్‌లతో ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించిన ఈ చిత్రంపెద్ద డిజాస్టర్ చిత్రంగా మిగిలింది. ఇలాంటి సినిమా అందించినందుకు అభిమానులకు రాహుల్ క్షమాపణలు కూడా చెప్పారు.
ఈ సినిమామ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ నేఫధ్యంలో తన ‘మిఠాయి’ని మరోసారి గుర్తుచేసుకుంటూ, రాహుల్ వల్ల తనకు ఎదురైన చేదు అనుభవాలను వెల్లడిస్తూ దర్శకుడు ప్రశాంత్ ఫేస్‌బుక్‌లో పెద్ద పోస్టు పెట్టారు. రాహుల్ అతడి ప్రవర్తనతో తనను తీవ్ర క్షోభకు గురి చేశాడని, సినిమా ఇలా రావడానికి కారణం కూడా అతనేనని ఆరోపించారు. ఈ క్రమంలో రాహుల్ వ్యక్తిత్వం గురించి కూడా ప్రశాంత్ ప్రస్తావిస్తూ ఈ విషయాలు చెప్పుకొచ్చాడు.
రాహుల్ నోరి విప్పితే అబద్ధమని, ఆయనకి అదొక రోగమని అన్నారు. మన ముందు ఒకలా వెనక ఇంకేలా మాట్లాడే నేర్పరి అని ఆరోపించారు.