మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్.. కరోనా వైరస్ నేప‌థ్యం!!

ద‌టీజ్ అమీర్ ఖాన్.. ఆయ‌నంతే!

మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ఏం చేసినా ప్ర‌త్యేకంగానే ఉంటుంది. అత‌డి సెల‌క్ష‌న్ గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. అత‌డు న‌టించే ప్ర‌తి సినిమా మాస్ట‌ర్ పీస్. తారే జ‌మీన్ పార్.. దిల్ చ‌హ‌తా హై.. ధూమ్ 3.. పీకే.. దంగ‌ల్.. సీక్రెట్ సూప‌ర్ స్టార్ .. ఇలా ప్ర‌తిదీ సంథింగ్ స్పెషాలిటీ ఉన్న సినిమానే. అందుకే అత‌డు న‌టిస్తున్న తాజా చిత్రంపైనా అంతే భారీ అంచ‌నాలేర్ప‌డ్డాయి. అమీర్ ప్ర‌స్తుతం లాల్ సింగ్ చ‌ద్దా అనే చిత్రంలో న‌టిస్తున్నాడు. ఇది హాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఫారెస్ట్ గంప్ కి రీమేక్ అన్న సంగ‌తి తెలిసిందే.

ఈ చిత్రంలో క‌రీనాక‌పూర్ ఖాన్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఇందులో లాల్ సింగ్ అనే శిక్కు యువ‌కుడిగా అమీర్ ప్ర‌త్యేక‌త ఉన్న పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ఇంత‌కుముందు లాల్ సింగ్ ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేస్తే అభిమానుల్లోకి దూసుకెళ్లింది. అమీర్ ప‌ర్ఫెక్ట్ శిక్కు యువ‌కుడిగా కుదిరాడ‌న్న ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ప్ర‌స్తుతం ఈ సినిమా ప‌తాక స‌న్నివేశాల్ని పూర్తి చేసేందుకు రంగం సిద్ధ‌మైంది.

అయితే ఊహించ‌ని విధంగా ఈ సినిమా క్లైమాక్స్ ని మార్చేశార‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుత క‌రోనా మ‌హ‌మ్మారీని క‌థ‌లోకి డ్రాగ్ చేశార‌ట‌. క్లైమాక్స్ క‌రోనా విల‌యంతో ముగుస్తుంద‌ని తెలిసింది. నిజంగానే అమీర్ మాస్ట‌ర్ మైండ్ ఎంతో తెలివిగా ప‌ని చేసింద‌ని దీనిని బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు. నేటి సీన్ లో.. క‌రోనా తో క‌నెక్టివిటీ హైలైట్ గా ఉంటుంద‌న‌డంలో సందేహ‌మేం లేదు.

https://twitter.com/aamir_khan/status/1196289071472996352