వెబ్ సిరీస్ పై తమన్నా కన్ను!?

Tamannaah Bhatia
అవును.. మీరు వింటున్నది నిజమే.. !  తాజాగా వెబ్ సిరీస్ లపై తమన్నా కన్ను పడింది. కరోనా తెచ్చిన కాలమే ఇది కావొచ్చేమే అంటున్నారంతా.  స్టార్ హీరోయిన్స్ కి ఓటీటీ ప్లాట్ ఫాం వచ్చినప్పటి నుంచి మంచి అవకాశాలు లభిస్తున్నాయి. ముఖ్యంగా సీనియర్ నటీ, నటులకి  ఓటీటీ ప్లాట్ ఫాం ద్వారా  పెద్ద ఊరట దొరికినట్లయింది.  సినిమాలలో చేయడానికి ఉండే కొన్ని పరిమితులను ఓటీటీలో దాటేయొచ్చు. అక్కడ సెన్సార్ ఉంటుంది. ఏది చేసినా చాలా జాగ్రత్తగా చేయాలి. చేసినా సెన్సార్ లో ఉంటుందో కట్ అవుతుందో చెప్పలేము. అదే ఓటీటీలో అయితే ఎంతైనా చేయొచ్చు.
 
ఏదైనా ప్రూవ్ చేసుకోవచ్చు. ఇక ఇక్కడ తెరకెక్కించే వెబ్ సిరీస్ లలో చాలా వైవిధ్యమైన జోనర్స్ లో నటించే అవకాశం మన స్టార్ హీరోయిన్స్ కి దక్కుతోంది. అంతేకాదు షూటింగ్ చాలా త్వరగా కంప్లీట్ అవుతుంది. భారీ రెమ్యూనరేషన్ అందుతోంది. ముఖ్యంగా హీరోయిన్ కి డ్రిమ్మ్ లా ఉండే కొన్ని నెగిటివ్ రోల్స్..బోల్డ్ క్యారెక్టర్స్..డీ గ్లామర్ రోల్స్ లో నటించి ఇక్కడ తమలోని కొత్త కోణాలను బయట పెట్టొచ్చు. అందుకే కియారా  అద్వాని, రాధిక ఆప్టే, ప్రియమణి, సమంత, కాజల్ అగర్వాల్..
 
ఇలా మన సౌత్ హీరోయిన్స్ అందరూ వెబ్ సిరీస్ లో నటించడానికి సై అంటున్నారు. ప్రస్తుతం సమంత సక్సస్ ఫుల్ సిరీస్ ది ఫ్యామిలీ మాన్ సీజన్ 2 లో నటించింది. ఇందులో ప్రియమణి కూడా నటించింది. ఇక ఈ సిరీస్ లో సమంత నెగిటివ్ రోల్ పోషించింది. త్వరలో ఈ వెబ్ సిరీస్ ఒటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. అంతేకాదు కాజల్ అగర్వాల్ ఒక వెబ్ సిరీస్ లో నటిస్తుంది. అయితే అదే బాటలో ఇప్పుడు మరో హీరోయిన్ చేరబోతోందిట. ఆమే తమన్నా. నాకు మాత్రం ఏం తక్కువ నేను వెబ్ సిరీస్ లో నటిస్తానంటూ మూడు  తమిళ వెబ్ సిరీస్ లకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. దాంతో తమన్నా ఇప్పుడు రూటు మార్చి వెబ్ సిరీస్ బాట పట్టింది. మరి  తమన్నాఇక్కడ ఎంతవరకు సక్సస్ అవుతుందో చూడాలి మరి.