చిరుకి నిద్రలేకుండా చేస్తున్న కొరటాల శివ !

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న 152వ సినిమా షూటింగ్ శ‌ర వేగంగా జ‌రుగుతోంది. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త‌వ్ంలో కొకాపేట్ లోని ప్ర‌త్యేకంగా నిర్మించిన సెట్ల‌ల‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుతున్నారు. మెగాస్టార్ కు ఇచ్చిన మాట ప్ర‌కారం 80 నుంచి 99 రోజుల్లో చిత్రీక‌ర‌ణ మొత్తం పూర్తిచేసి ప్యాక్ అప్ చెప్పాలి కాబ‌ట్టి ఆదిశ‌గా యూనిట్ శ్ర‌మిస్తోంది. మ‌రి మెగాస్టార్ మాటిచ్చి ఇప్పుడు ఇబ్బంది ప‌డుతున్నారా? అంటే అవున‌నే తెలుస్తోంది. కండీష‌న్ ప్ర‌కారం షూటింగ్ త‌క్కువ డేస్ లోనే పూర్తి చేయాలి కాబ‌ట్టి కొర‌టాల టీమ్ అంద‌రికీ విరామం లేకుండా చుక్క‌లు చూపిస్తున్నాడుట‌.

మెగాస్టార్ ను సైతం వ‌ద‌ల‌కుండా రేయింబ‌వ‌ళ్లు షూటింగ్ చేస్తూనే ఉన్నారుట‌. అదీ రాత్రిపూట చిత్రీక‌రించాల్సిన స‌న్నివేశాలు ఎక్కువ‌గా ఉండ‌టంతో చిరంజీవికి నిద్ర స‌రిపోవ‌డం లేదుట‌. ప‌గ‌లంతా డే స‌న్నివేశాలు..రాత్రి అయితే ఆ సంద‌ర్బానికి త‌గ్గ స‌న్నివేశాల‌తో యూనిట్ కి ఖాళీ ఉండ‌టం లేదుట‌. కోకాపేట్ షెడ్యూల్ మొద‌లైన ద‌గ్గ‌ర నుంచి ఇదే ప‌రిస్థితి అని స‌మాచారం. చిరుకు ప‌గ‌లు కాస్త స‌మ‌యం దొరికి నిద్ర‌పోయినా…నైటౌట్ చిత్ర‌నీక‌ర‌ణ కు వెళ్ల‌డం ఇబ్బందిగానే మారింద‌ని అంటున్నారు. దీంతో చిరు నిద్ర‌లేమితో బాధ‌ప‌డుతున్న‌ట్లు తెలిసింది. చిరు 99 డేస్ కండీష‌న్ పెట్ట‌డంతోనే కొర‌టాల ఇలా అంద‌ర్ని ఇబ్బంది పెట్టాల్సి వ‌స్తుంద‌ని తెలుస్తోంది. సాధార‌ణంగ కొర‌టాల ఒక్కో సినిమా చిత్రీక‌ర‌ణ‌కు 130 నుంచి 140 రోజులు తీసుకుంటార‌న్న సంగ‌తి తెలిసిందే.