నేడు సెలబ్రిటీలంతా రాఖీ పండగను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. రాఖీ మతపరమైన పండుగ అయినా ప్రతిష్ఠాత్మకంగా జరుపుకున్నారు. తారలు తమ ప్రియమైనవారితో అక్క చెల్లెళ్లతో ఫోటోల్ని షేర్ చేస్తుండటంతో సోషల్ మీడియాలో చాలా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఒక వీడియోను పోస్ట్ చేసినట్లే చేసారు. ఇందులో ఆయన ఇద్దరు సోదరీమణులు రాఖీ కడుతూ కనిపించారు. చిరు కుటుంబంలో ఇది ప్రతియేటా చూసేదే. రాఖీ కట్టి ఆశీర్వాదం అందుకున్నారు.
చిరు ఇటీవల క్వారంటైన్ సమయాన్ని ఇంట్లోనే గడుపుతున్నారు. అతని కుటుంబానికి ఇది సెలబ్రేషన్ మూవ్ మెంట్ అనే చెప్పాలి. అక్క చెల్లెళ్లతో విలువైన సమయం వెచ్చించేందుకు వీలుపడింది. కోవిడ్ వల్ల ఆచార్య ఆలస్యమవ్వడం ఇలా వర్కవుటైంది. పండుగలన్నీ అద్భుతంగా సెలబ్రేట్ చేస్తున్నారన్నమాట. ఇక తాజాగా ఆచార్య కోసం మారిన లుక్ లో ఎంతో యంగ్ గా కనిపిస్తున్నారు చిరు.