“గాడ్ ఫాదర్” తో కామెడీ చేస్తున్న మెగాస్టార్..లేకపోతే మరేంటి..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార కీలక పాత్రలో నటించిన లేటెస్ట్ సినిమా “గాడ్ ఫాదర్” రిలీజ్ కి దగ్గరలో ఉంది. దీనితో ఈ చిత్రం పై అంచనాలు కూడా గ్రాడ్యుయల్ గా పెరుగుతూ వస్తున్నాయి. మరి ఇదంతా బాగానే ఉంది ఓ పక్క చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా భారీ స్థాయిలోనే ప్లాన్ చేస్తున్నారు.

పైగా తెలుగు సహా హిందీలో రెండు ప్రీ రిలీజ్ లు చెయ్యాల్సి ఉంది. అయితే ఈ సినిమాని దర్శకుడు మోహన్ రాజా తో మలయాళ భారీ హిట్ సినిమా లూసిఫెర్ కి రీమేక్ గా చేశారు. ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ ఈరోజు చిత్ర యూనిట్ ఓ కొత్త అనౌన్సమెంట్ ని అందించారు.

ఈ సినిమా హిందీ, తెలుగుతో పాటుగా మలయాళంలో కూడా రిలీజ్ చేస్తున్నారట. ఈ మలయాళం రిలీజ్ చేయడం అనేది ఇప్పుడు కామెడీ అయ్యిపోయింది. ఆల్రడీ మలయాళం సినిమా పైగా ఆ సినిమాలో డబ్బింగ్ అయ్యి రిలీజ్ అయ్యింది. అలా అయ్యిన దాన్నే మళ్ళీ తెలుగులో రీమేక్ చెయ్యడమే పెద్ద కామెడీ అనుకుంటే..

తీసుకెళ్లి మళ్ళీ దాన్నే మలయాళంలో రిలీజ్ చేస్తున్నట్టు తెలపడం ఎపిక్ కామెడీ అయ్యింది. ఇలా ఓ భాషలో తీసిన సినిమాని రీమేక్ చేసి మళ్ళీ అదే భాషలో రిలీజ్ చెయ్యడం ఏంటో అసలు ఈ డిసిషన్ కూడా ఎవరిదో అర్ధం కాని పరిస్థితి ఇపుడు ఏర్పడింది.