ప్లాప్ కావాల్సిన “గాడ్ ఫాదర్” ఈవెంట్ ని భారీ హిట్ చేసిన చిరంజీవి.!

మెగాస్టార్ చిరంజీవి పేరు గత కొన్ని రోజులు నుంచి తెలుగు సినిమా అలాగే రాజకీయ వర్గాల్లో కూడా ఓ రేంజ్ లో మారుమోగుతుంది. అయితే తాను నటించిన లేటెస్ట్ అవైటెడ్  సినిమా గాడ్ ఫాదర్ కోసం అందరికీ తెలిసిందే. మొదట్లో ఏమాత్రం బజ్ లేని సినిమా ఇప్పుడు దీని కోసం టాలీవుడ్ మాట్లాడుకునే రేంజ్ కి వచ్చింది.

ఇక ఈ అవైటెడ్ సినిమాలో ఎందరో బిగ్ స్టార్స్ కూడా నటించగా ఈ చిత్రానికి సంబంధించి గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే నిన్న ఘనంగా అనంతపూర్ లో స్టార్ట్ అయ్యింది. మరి ఈ ఈవెంట్ విషయంలో అయితే ఓ విషయం ఊహించని లెవెల్లో జరిగింది.

అప్పటి వరకు ఎన్నో పనులు ప్లాన్ లు జరిపినప్పుడు రాని వర్షం సరిగ్గా ఈవెంట్ స్టార్ట్ అయ్యి మెగాస్టార్ అక్కడికి వచ్చాక మొదలయ్యిపోయింది. దీనితో ఆ భారీ వర్షంలో ఈవెంట్ ఆగిపోతుంది అప్పటి వరకు చేసిన ప్లానింగ్స్ వచ్చిన అభిమానులు అంతా ప్లాప్ అనుకున్నారు కానీ ఆశ్చర్యకరంగా ఆ వానని కూడా మెగాస్టార్ తనదైన శైలిలో ప్లస్ గా మార్చుకొని అరగంట కి పైగా తన స్పీచ్ ని అందించారు.

ఇది మాత్రం ఊహించని అంశం అని చెప్పి తీరాలి. డెఫినెట్ గా అయితే ఈ వాన దెబ్బకి ఈవెంట్ ప్లాప్ అయ్యిపోయింది అని చాలా మంది అనుకున్నారు కానీ మెగాస్టార్ మాత్రం భారీ హిట్ చేసి చూపించారు. మరి ఇదే ఫలితం సినిమాకి కూడా రిపీట్ అవుతుందో లేదో చూడాలి.