తెలుగు సినిమా దగ్గర అపారమైన గౌరవం క్రేజ్ ఉన్నటువంటి స్టార్ హీరోస్ లో సీనియర్ మోస్ట్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకరు. అయితే మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఈ ఏడాది రిలీజ్ చేసిన సినిమా “ఆచార్య” ని అయితే తెలుగు ఆడియెన్స్ మరీ ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ అంత సులువుగా మర్చిపోరు.
తప్పుడు మెగా హీరోస్ లో ఉందో లేక దర్శకుడు కొరటాల శివ లో ఉందో కానీ ఈ అద్భుత కళాఖండం చూసి ఆడియెన్స్ కనీ వినీ ఎరుగని స్థాయి డిజాస్టర్ గా నిలిపేశారు. దీనితో ఆ సమయంలో మెగాస్టార్ అయితే అసలు ఈ సినిమా కోసం మాట్లాడ్డానికే ఇష్టపడలేదు.
పలు ఈవెంట్స్ లో కూడా చిరుపై మీడియా వారు ఈ సినిమా ప్రస్తావన తెచ్చినా దాన్ని దాటవేసి వేరే మాట చెప్పేసేవారు. దీనితో అయితే ఈ చిత్రం విషయంలో చిరు ఎంత డిజప్పాయింట్ అయ్యారో అర్ధం అయ్యింది. ఇక ఇప్పుడు అయితే మొదటి సారి తన సినిమా ఘోర వైఫల్యంపై మాట్లాడ్డం ఇండస్ట్రీ వర్గాల్లో ఒక బిగ్ న్యూస్ గా మారింది. చిరు నిన్న ఓ చిన్న సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ కామెంట్స్ చేసారు.
ఇప్పుడు కంటెంట్ మాత్రమే కింగ్ సినిమాలో కంటెంట్ ఉంటే లేటెస్ట్ గా బింబిసార, సీతారామం, కార్తికేయ 2 చిత్రాలు ప్రూవ్ చేశాయని, కంటెంట్ లేకపోతె జనం రెండో రోజు నుంచే మొహం చాటేస్తున్నారని అందుకు ఉదాహరణ నా సినిమానే అని నా సినిమా బాగోకపోవడంతో రెండో రోజు నుంచే జనం కనిపించలేదని పలు సంచలన కామెంట్స్ చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది. మొత్తానికి అయితే ఈ సినిమా విషయంలో మెగాస్టార్ మాత్రం బాగా హర్ట్ అయ్యారనే అనిపిస్తుంది.