“ఆచార్య” మేటర్ లో మెగాస్టార్ కామెంట్స్ పై పెద్ద ఎత్తున విమర్శలు..!

ఈ ఏడాది టాలీవుడ్ లో రిలీజ్ అయ్యిన చిత్రాల్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ సినిమాలు కూడా ఎక్కువే ఉన్నాయని చెప్పాలి. అయితే వాటిలో మొదటగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ నుంచి స్టార్ట్ కాగా దాని తర్వాత మెగా మల్టీ స్టారర్ గా వచ్చిన “ఆచార్య” ఎపిక్ డిజాస్టర్ అయ్యింది.

రికార్డు మొత్తంలో నష్టాలు మిగిల్చిన చిత్రాల్లో ఒకటిగా ఇది నిలిచింది. దీని తర్వాత లైగర్ కూడా వచ్చింది అది వేరే విషయం కానీ ఆచార్య విషయంలో మాత్రం మెగాస్టార్ పై ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

ఈ చిత్రం దారుణ పరాజయంపై మెగాస్టార్ లేటెస్ట్ గా మాట్లాడుతూ ఇది నటులుగా మేము చెయ్యాల్సింది చేశామని ఇంకా దర్శకుడు ఏం చెప్తే అదే చేశామని చెప్పడం సెన్సేషన్ గా మారింది. దీనితో సినిమా హిట్ అయితే తాము తీసుకోవడం తీరా ప్లాప్ అయ్యాక దాన్ని డైరెక్టర్ కొరటాల శివపై నెట్టెయ్యడం కరెక్ట్ కాదని చిరు ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

అలాగే మరికొందరు అయితే బాలయ్య మహేష్ బాబు లు ఇలాంటి విషయాల్లో ఇచ్చిన స్టేట్మెంట్స్ తో కంపేర్ చేస్తున్నారు. మొత్తానికి అయితే మెగాస్టార్ కామెంట్స్ విషయంలో ఇప్పుడు మంచి రచ్చే నడుస్తుంది.