ఆచార్య లో ఫుల్ లెన్త్ రోల్ లో చరణ్ !

Producers spend a lot of money for Chiranjeevi's intro song in acharya movie

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ఆచార్య. ఈ ఆచార్య సినిమాపై ఇండస్ట్రీలో , అభిమానుల్లో అంచనాలు ఎంత భారీగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రంలో చిరంజీవి మరోసారి డ్యూయల్ రోల్లో యాక్ట్ చేయనున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో చరణ్.. కథను మలుపు తిప్పే కీలక పాత్రలో నటించనున్నాడు.

ఇకపోతే ,ఈ మూవీలో కొద్ది నిమిషాల పాటుమాత్రమే చరణ్ కనిపించబోతున్నట్లు మొదట్లో ప్రచారం జరిగింది. దాన్ని చిరంజీవి ధృవీకరించారు. ఆ పాత్ర చాలా కీలకమైందని, స్టోరీ చెప్పే సమయంలోనే ఇందులో చెర్రీని ఊహించుకున్నట్లు చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అంతేకాదు ఈ మూవీ షూటింగ్ కోసం రాజమౌళి , చరణ్ పర్మిషన్ ఇచ్చినట్లు కూడా ఆయన తెలిపారు.

మొత్తంగా ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో ఆచార్యలో చరణ్ సినిమా మొత్తం కనిపించనన్నట్లు టాక్ నడుస్తోంది. ఈ మేరకు దర్శకుడు కొరటాల శివ సైతం ఈ విషయం తన సన్నిహితులతో తెలిపినట్లు సమాచారం. ఏదీ ఏమైనా భర్త, కొడుకు కలిసి నటించాలన్న చిరంజీవి భార్య సురేఖ కల ఆచార్యతో నెరవేరబోతోంది. అంతేకాకుండా చిరు సినిమాలో చరణ్ సినిమా మొత్తం కనిపిస్తాడన్న న్యూస్ ‌తో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.