ఈ ఫొటోలను అడ్డం పెట్టి మెగా ఫ్యామిలీపై జోక్ లు,సెటైర్స్

                                                                        (సూర్యం)

సోషల్ మీడియాలో ఉండే హీరోలు అభిమానులు ఎప్పుడు ఎవరిని కెలుకుదామా..ఎవరిపై సెటైర్స్ వేద్దామా అని కాచుకుని కూర్చుంటారు. వాళ్కు కొద్దిగా మేత దొరికిందంటే రెచ్చిపోతూంటారు. పొద్దస్తమానూ అవే ట్వీట్స్, పోస్ట్ లతో ఓ విధమైన ఆనందం పొందుతూంటారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీకు వ్యతిరేకంగా చాలా పేజీలు, గ్రూప్ లు ఉన్నాయి. వాళ్లు ఎప్పుడు మెగా ఫ్యామిలిపై వ్యంగ్య బాణాలు విసురుదామా అని అవకాసం కోసం ఎదురుచూస్తూంటారు. అలాంటి అవకాసం  ‘హాలోవీన్’ఈవెంట్ ఇచ్చింది.

సరదాగా మెగా ఫ్యామిలీలో జరిగిన  ‘హాలోవీన్’ఈవెంట్ సోషల్ మీడియాలో ఓ వర్గం జనాలకి ఆహారం అయ్యిపోయింది.  ఈ నెల 31వ తేదీతో ‘హాలోవీన్’ వేడుకలు ముగియనుండటంతో మెగా ఫ్యామిలీ మొత్తం విచిత్ర వేషధారణతో సందడి చేసి ఫోటోలు వదిలింది. ఈ గెటప్ లలో.. మెగాస్టార్ చిరంజీవి, వరుణ్ తేజ్, అల్లు అర్జున్, స్నేహారెడ్డి, నిహారిక, సుస్మిత శ్రీజ కల్యాణ్ దేవ్, ఉపాసన ఇలా దాదాపు ఫ్యామిలీ మొత్తం కనపడి.. వివిధ రకాల గెటప్‌లలో కనిపించి భయపెట్టారు. రామ్ చరణ్ మాల ధరించి ఉండటంతో ఆయన సంప్రదాయ దుస్తుల్లోనే ఉన్నారు.

ఇలా  మెగా ఫ్యామిలీ మొత్తం దెయ్యాలు, భూతాలుగా మారి హడలెత్తించటం మెగా అభిమానులకు పండుగ క్రింద ఉంది. వాళ్లు ఈ ఫొటోలతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. అయితే కొందరు మెగా ఫ్యామిలీకు వ్యతిరేక బ్యాచ్ మాత్రం..వీళ్ల నిజ జీవిత గెటప్ లతో ఫొటోలు దిగారు అంటూ కామెంట్స్ చేయటం మొదలెట్టారు. అప్పటికీ మెగా ఫ్యామిలీ అభిమానులు …సరదాకి, సీరియస్ కు తేడా తెలియదా అంటూ తిట్టిపోస్తున్నారు. ఏదైమైనా ఇలా సరదా ఈవెంట్ పై నోటి కొచ్చిన కామెంట్స్ చేయటం పద్దతి కాదు కదా.