బాలయ్య ఫాన్స్ కి భారీ ట్రీట్.. “చెన్న కేశవ రెడ్డి” రీ రిలీజ్ కి రంగం సిద్ధం.!

తెలుగు సినిమా దగ్గర ఉన్న బిగ్ స్టార్స్ లో మెగాస్టార్ చిరంజీవి టైం నుంచి ఉన్న స్టార్ లు కూడా ఉన్నారు. మరి వారిలో బాలయ్య గట్టి పోటీ ఇవ్వగా ఒక రెండు దశాబ్దాల కిందట అయితే తన ఫ్యాక్షన్ సినిమాలతో బాలయ్య టాలీవుడ్ లో నెంబర్ 1 స్థానంలోకి వచ్చారు.

అలా తాను చేసిన పలు భారీ యాక్షన్ చిత్రాల్లో దర్శకుడు వి వి వినాయక్ తో చేసిన క్రేజీ క్లాసిక్ మాస్ సినిమా చెన్న కేశవ రెడ్డి సినిమా కూడా ఒకటి. అయితే ఇప్పుడు ఈ సినిమా కోసం బాలయ్య అభిమానులు గ్రాండ్ ప్లానింగ్స్ చేసుకుంటున్నారట. ఇటీవల మన టాలీవుడ్ లో రీ రిలీజ్ సినిమాల హవా మొదలైన సంగతి తెలిసిందే.

దీనితో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలు భారీ వసూళ్లతో మళ్ళీ రీ రిలీజ్ అయ్యి అదరగొట్టాయి. అయితే ఇప్పుడు నందమూరి అభిమానులు బాలయ్య నటించిన చెన్నకేశవ రెడ్డి సినిమాని ప్లాన్ చేసుకున్నారట.

2002 లో రిలీజ్ అయ్యిన ఈ చిత్రం ఇప్పుడు 20 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మొదట ఏకంగా ఓవర్సీస్ లో గ్రాండ్ రీ రిలీజ్ ని ప్లాన్ చేసుకున్నారట. ఫస్ట్ అటెంప్ట్ గానే ఒక్క యూఎస్ లో 30కి పైగా థియేటర్లులో ప్లాన్ చేసుకున్నారట. మరి ఈ షో లు ఈ సెప్టెంబర్ 24, 25లో ప్లాన్ చేయగా మరిన్ని డీటెయిల్స్ అందిస్తామని తెలిపారు.