ఆఫ్ సీజన్ లో టాలీవుడ్ కు మ్యారేజ్ మేనియా

ఆషాడ మాసంలో మ్యారేజ్ ముహూర్తాలుండవు. అందుకే ఆ టైమ్లో ఎవ్వరూ ముహూర్తాల జోలికిపోరు. బట్ మన సినిమా వాళ్లకు అవేమి పట్టవు కదా. తెరపై పెళ్లే కదా అనిచెప్పి లగ్నాలతో సంబందాల్లేకుండా నాన్ సీజన్లో మ్యారేజ్ బేస్డ్ చిత్రాలను ఇట్టే రిలీజ్ చేసేస్తుంటారు. తాజాగా వచ్చిన, వస్తోన్న చిత్రాలను చూస్తే ఎవ్వరైనా ఈవిషయాన్ని ఒప్పుకోవాల్సిందే. టాలీవుడ్లో ఈ ఆషాడ మాసంలో వరుస బెట్టి వచ్చే చిలసౌలకు హారతులిస్తూ… హ్యాపీ వెడ్డింగ్ లను ఈజీగా జరిపించేస్తూ… జరగబోయె శ్రీనివాస కళ్యాణం తీరును ముందుగానే చూపిస్తుంటే టాలీవుడ్ కు అన్ సీజన్ లో మ్యారేజ్ మేనియా అంటుకుంటుందా అనిపిస్తుంది.


టాలీవుడ్లో తాజాగా కనిపిస్తోన్న ఈ పెళ్లి కళ చూశాక….ఏంటి ఈ టైమ్లో ఇన్ని పెళ్లి కథా చిత్రాలు ఇలా క్యూ కట్టుకుని మరీ వచ్చేస్తున్నాయే… అనే అనుమానం ప్రతి సగటు ప్రేక్షకుడికి కలగక మానదు. ఈవారం పది రోజులలో ఇప్పటి వరకు వచ్చిన రెండు చిత్రాలైన హ్యాపీ వెడ్డింగ్, చిలసౌలు ఓకే అనిపించుకున్నాయి. ఐతే చిలసౌకు మంచి పేరు వచ్చింది. ఇక ఈ నెల 9న రిలీజ్ కు రెఢీ అయిన శ్రీనివాస కళ్యాణం రిలీజ్ కు ముందే పాజిటివ్ వైబ్రేషన్స్ ఇస్తుంది. ఇప్పటికే యూనిట్ షోను చూసి ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది

 

 

 

శ్రీనివాస కళ్యాణం సైతం హిట్ టాక్ తెచ్చుకుంటే టాలీవుడ్ మరింత మంది నిర్మాతలు తామనుకున్న బడ్జెట్ లో పెళ్లి బ్యాక్ డ్రాప్ తో మరిన్ని చిత్రాలు చేయడానికి ముందుకు రావచ్చు. ఆన్ సీజన్లో రిలీజ్ చేసిన పెళ్లి సినిమాలే ఇంతలా వసూల్లు రాబడుతుంటే …సీజన్లో రిలీజ్ చేయబోయే మా సినిమాలు ఎందుకు వసూల్లు కొల్లగొట్టవనే మనస్తత్వంతో కొందరు అడుగులు ముందుకు వేయవచ్చు. ఏది ఏమైనా టాలీవుడ్ కొచ్చిన పెళ్లి కళ ఇప్పట్లో పోయేటట్లుగా అయితే కనిపించడం లేదు.