మ‌న్మ‌థుడు 2 టీజర్ టైం ఫిక్స్

మ‌నం ఎంట‌ర్ ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్స్‌, వ‌యకామ్ 18 స్టూడియోస్ ప‌తాకాలపై నాగార్జున అక్కినేని, పి.కిర‌ణ్(జెమిని కిర‌ణ్‌) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతోన్న ఈ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ షూటింగ్ పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి.

ఇటీవల విడుదలైన టీజ‌ర్‌కి.. అవంతిక అనే పాత్ర‌లో న‌టించిన ర‌కుల్ ప్రీత్ సింగ్ క్యారెక్ట‌ర్ టీజ‌ర్‌కు హ్యూజ్ రెస్పాన్స్‌ వచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల 25న ఉదయం 11గంటల 11 నిమిషాలకు ఈ చిత్ర ట్రైల‌ర్‌ను విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర నిర్మాతలు తెలిపారు. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ఆగ‌స్ట్ 9న చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సినిమా మన్మధుడు మొదటి భాగం లా సీక్వెల్ లా ఉంటుందా లేదా అని రిలీజ్ వరకు వేచి చూడలి.ఇందులో డైలాగ్స్ సినిమాకి హైలెట్ గా నిల్వనున్నాయి.