‘మన్మథుడు2’ స్టిక్కర్లు చూశారా? అదుర్స్

‘మన్మథుడు2’ స్టిక్కర్లు చూశారా? అదుర్స్

సినిమా సినిమాకీ టాలీవుడ్‌ ‘కింగ్’ అక్కినేని నాగార్జున మరింత హ్యాండ్సమ్‌గా తయారవుతున్న సంగతి తెలిసిందే. ఆయన హీరోగా ‘మన్మథుడు 2’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నాగ్‌కు జోడీగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటిస్తు్న్నారు. సమంత అతిథి పాత్రలో కనిపిస్తారు. నాగార్జున, పి.కిరణ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సినిమా కథ దాదాపుగా పోర్చుగల్‌ చుట్టూ తిరుగుతుంది. . అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ సమయం దగ్గర పడటంతో ఈ చిత్రం ప్రమోషన్స్ వేగం పెంచింది.

ఈ నేపధ్యంలో చిత్రం యూనిట్ ప్రచారాన్ని వెరైటీగా చేపడుతోంది. ‘మన్మథుడు2’ చిత్ర యూనిట్ విడుదలకు ముందే నాగార్జున, రకుల్‌, వెన్నెల కిషోర్‌ల వాట్సాప్‌ స్టిక్కర్లను విడుదల చేసింది. ప్రస్తుతం చాలామంది వాట్సాప్‌లలో ఇవే చక్కర్లు కొడుతున్నాయి. అవి విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ‘మన్మథుడు2’ చిత్రానికి చైతన్‌ భరద్వాజ్‌ సంగీతం అందిస్తున్నారు. అన్నపూర్ణా స్టూడియోస్‌, వయకామ్‌ 18 మోషన్‌ పిక్చర్స్‌, ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ నిర్మిస్తున్నాయి

నాగార్జున గత ఏడాది ‘దేవదాస్‌’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దీని తర్వాత ఆయన బాలీవుడ్‌ సినిమా ‘బ్రహ్మాస్త్ర’లో నటిస్తున్నారు. అదేవిధంగా తమిళంలో ధనుష్‌ హీరోగా తెరకెక్కుతోన్న సినిమాలో అతిథి పాత్రలో నటిస్తున్నారు. రకుల్‌ తమిళంలో సూర్య సరసన ‘ఎన్జీకే’ సినిమాలో, శివ కార్తికేయన్‌ సరసన మరో చిత్రంలో నటిస్తున్నారు.

సిద్ధార్థ్‌ మల్హోత్రా హీరోగా రూపొందనున్న ‘మర్‌జావా’లోనూ ఆమె సందడి చేయనున్నారు. నటుడిగా అలరించిన రాహుల్‌ రవీంద్రన్‌ ‘చి.ల.సౌ’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. దీని తర్వాత ఆయన తీస్తున్న రెండో సినిమా ‘మన్మథుడు 2’.