`మన్మధుడు 2` ప్రీబిజినెస్ లెక్కలివే
ఏ వయసులో అయినా రొమాన్స్ చేయొచ్చు.. కిస్సుకి అభ్యంతరాల్లేవ్!! అంటూ అరవై వయసులోనూ నాగార్జున చేస్తున్న హంగామా మామూలుగా లేదు. టాలీవుడ్ రొమాంటిక్ హీరోగా నాగ్ కి ఉన్న క్రేజు వేరు. అందుకే మన్మధుడు 2 టీజర్, ట్రైలర్ ఫ్యాన్స్ లోకి దూసుకెళ్లిపోయాయి. అందుకు తగ్గట్టే బిజినెస్ కూడా బాగానే జరుగుతోంది.
ఈ సినిమాకి శాటిలైట్, డిజిటల్, హిందీ డబ్బింగులు అన్నీ కలుపుకుని 22కోట్లు పైగానే బిజినెస్ సాగింది. ఇప్పుడు దానికి సమానంగా థియేట్రికల్ బిజినెస్ కూడా సాగిందని తెలుస్తోంది. మన్మధుడు 2 థియేట్రికల్ బిజినెస్ వివరాలు పరిశీలిస్తే.. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 20.50 కోట్ల బిజినెస్ చేసింది. . నైజాంలో అడ్వాన్సుల బేసిస్ బిజినెస్ చేశారు. ఉత్తరాంధ్రాలో నిర్మాతలే సొంత రిలీజ్ ప్లాన్ చేశారు. ప్రాంతాల వారీగా మన్మధుడు 2 బిజినెస్ వివరాలు పరిశీలిస్తే.. నైజాం 7కోట్లు, సీడెడ్ 2.5కోట్లు, ఆంధ్రా (ఎన్.ఆర్.ఏ)-7 కోట్లు, ఓవర్సీస్ 2.40కోట్లు, ఇతర భారతదేశం-1.60 కోట్లు బిజినెస్ సాగింది. ఏపీ-తెలంగాణ కలుపుకుని 16.5కోట్ల బిజినెస్ సాగింది. ఓవరాల్ గా 20.50కోట్లు బిజినెస్ చేశారు.
ఆగస్టు 9న రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఆదివారం (ఆగస్టు11) సెలవు.. బక్రీద్ ఆగస్టు 12 సెలవు.. స్వాతంత్య్ర దినోత్సవ సెలవు ఆగస్టు 15 ఈ చిత్రానికి బాగా కలిసొస్తున్నాయి. ఇటీవల నాగార్జున ఏ సినిమాని రిలీజ్ చేసినా సెలవు దినాల్ని పక్కాగా పరిగణిస్తున్నారు. మంచి రిలీజ్ మంచి మైలేజ్ ని ఇస్తుందన్న ప్రాతిపదికన మన్మధుడు 2ని రిలీజ్ ప్లాన్ చేశారు. దాదాపు 21కోట్ల మేర బిజినెస్ సాగించింది కాబట్టి ఆ మేరకు షేర్ వసూలు చేయాల్సి ఉంటుంది. `మన్మధుడు 2` తో మజిలీ.. ఓ బేబి రికార్డుల్ని కొట్టేస్తానని నాగ్ అభిమానులకు ప్రామిస్ చేశారు. మరి అది నిలబెట్టుకుంటారా లేదా? అన్నది చూడాలి.