`న‌వాబ్` స్టోరీ ఇదేనా?

                                                                         (ధ్యాన్)

ఇండియ‌న్ ఏస్ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న చిత్రం `న‌వాబ్‌`. (త‌మిళంలో సెక్క చివంద వాన‌మ్‌) అర‌వింద‌స్వామి, జ్యోతిక‌, అరుణ్ విజ‌య్‌, శింబు, అదితిరావు హైద‌రి, విజ‌య్ సేతుప‌తి, ప్ర‌కాశ్ రాజ్‌, ఐశ్వ‌ర్య రాజేశ్‌.. వంటి భారీ తారాగ‌ణంతో సినిమా రూపొందుతోంది. లైకా ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో మ‌ద్రాస్ టాకీస్ నిర్మాణంలో సినిమా రూపొందుతుంది. తెలుగులో కిర‌ణ్ డైలాగ్స్‌, సిరివెన్నెల సీతారామ‌శాస్త్ర్రి పాట‌లు రాశారు. త్వ‌ర‌లోనే విడుద‌ల కాబోయే ఈ సినిమా ట్రైల‌ర్ విడుద‌లైంది. ట్రైల‌ర్‌.. మేకింగ్ సినిమాపై అంచ‌నాల‌ను పెంచుతుంది. అస‌లు క‌థ ఏంటంటే భూప‌తి రెడ్డి(ప్ర‌కాశ్ రాజ్‌) బిజినెస్ మేన్ ముసుగులో ఉండే పెద్ద మాఫియా నాయ‌కుడు. ఇత‌నికి గ్గుర‌కు కొడుకులు పెద్ద‌వాడు వ‌ర‌ద‌(అర‌వింద‌స్వామి) తండ్రి త‌ర్వాత త‌నే రాజు కావాల‌నుకుంటాడు. రెండో వాడు త్యాగు(అరుణ్ విజ‌య్‌), మూడో వాడు రుద్ర‌(శింబు) వీరిద్ద‌రూ కూడా తండ్రి స్థానం కోసం ఆశ ప‌డుతుంటారు కానీ.. అన్న అంటే కాస్త భ‌య‌ముంటుంది. వ‌ర‌ద స్నేహితుడు ర‌సూల్‌(విజ‌య్ సేతుప‌తి) పోలీస్ ఇన్సెపెక్ట‌ర్‌. ఇత‌ను గ్యాంగ్ స్టర్‌గా మారి.. భూప‌తి రెడ్డి స్థానాన్ని ఆక్ర‌మించుకోవాల‌ని ప్లాన్ చేస్తుంటాడు. అందుకోసం ఎలాంటి పోరాటం జ‌రిగింద‌నేదే అస‌లు క‌థ‌. మాపియా డాన్ స్థానం కోసం జ‌రిగే పోరాట‌మే న‌వాబ్‌.