Home Tollywood సెప్టెంబర్ 27న ప్ర‌పంచ వ్యాప్తంగా `న‌వాబ్` విడుద‌ల‌

సెప్టెంబర్ 27న ప్ర‌పంచ వ్యాప్తంగా `న‌వాబ్` విడుద‌ల‌

ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను తెర‌కెక్కించి ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్ట‌కున్న ఏస్ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం. ఈయ‌న డైరెక్ష‌న్‌లో రూపొందిన భారీ మ‌ల్టీస్టార‌ర్ `న‌వాబ్‌`. లైకా ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో మ‌ద్రాస్ టాకీస్ బ్యాన‌ర్‌పై రూపొందుతున్న ఈ చిత్రంలో అర‌వింద స్వామి, జ్యోతిక‌, అరుణ్ విజ‌య్‌, ఐశ్వ‌ర్య రాజేశ్‌, శింబు, విజ‌య్ సేతుప‌తి, ప్ర‌కాశ్ రాజ్, త్యాగ‌రాజ‌న్ త‌దిత‌రులు ప్ర‌ధాన తారాగ‌ణంగా నటించారు. ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళంలోసెప్టెంబ‌ర్ 27న ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.   

ఈ సంద‌ర్భంగా లైకా ప్రొడ‌క్ష‌న్స్‌, మ‌ద్రాస్ టాకీస్ సంస్థ‌ల ప్ర‌తినిధులు మాట్లాడుతూ – “న‌వాబ్ సినిమాను సెప్టెంబర్ 27న తెలుగు, త‌మిళ భాషల్లో గ్రాండ్‌రిలీజ్ చేస్తున్నాం. ముందుగా సెప్టెంబ‌ర్ 28న విడుద‌ల చేయాల‌నుకున్న‌ప్ప‌టికీ … తాజాగా ఓ రోజు ముందుగానే అంటే సెప్టెంబ‌ర్ 27నే సినిమాను విడుద‌ల చేయ‌బోతున్నాంరీసెంట్‌గా విడుద‌ల చేసిన ట్రైల‌ర్‌కు ప్రేక్ష‌కుల నుండి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. మ‌ణిర‌త్నంగారి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. న‌వాబ్‌`మంచి యాక్ష‌న్ ప్యాక్‌డ్ మూవీ. ఎమోష‌నల్ కంటెంట్‌తో సాగే చిత్ర‌మిది. అర‌వింద స్వామి, జ్యోతిక‌, అరుణ్ విజ‌య్‌, ఐశ్వ‌ర్య రాజేశ్‌, శింబు, విజ‌య్ సేతుప‌తి, ప్ర‌కాశ్ రాజ్ వంటి భారీ తారాగ‌ణంతో , ఎ.ఆర్‌.రెహమాన్‌, సంతోశ్ శివ‌న్‌, శ్రీక‌ర్ ప్ర‌సాద్‌, సిరివెన్నెల సీతారామ శాస్త్రి వంటి టాప్ టెక్నీషియ‌న్స్ స‌హ‌కారంతో తెర‌కెక్కిన ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ అంచ‌నాల‌ను మించేలా సినిమా ఉటుంద‌నడంలో సందేహం లేదు“ అన్నారు. 

ర‌వింద స్వామి, జ్యోతిక‌, అరుణ్ విజ‌య్‌, ఐశ్వ‌ర్య రాజేశ్‌, శింబు, విజ‌య్ సేతుప‌తి, ప్ర‌కాశ్ రాజ్, త్యాగ‌రాజ‌న్ త‌దిత‌రులు తారాగ‌ణంగా న‌టిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎ.ఆర్‌.రెహ‌మాన్‌, సినిమాటోగ్ర‌ఫీ: స‌ంతోశ్ శివ‌న్‌, ఎడిటింగ్‌: శ‌్రీక‌ర్ ప్ర‌సాద్‌, పాట‌లు:  సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి, మాట‌లు:  కిర‌ణ్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: శ‌ర్మిష్ట రాయ్‌, కాస్ట్యూమ్స్: ల‌క్హానీ, యాక్ష‌న్‌:  దిలీప్ సుబ్బరాయ‌న్‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్:  శివ ఆనంది, ర‌చ‌న‌: మ‌ణిర‌త్నం, శివ ఆనంది, నిర్మాత‌లు:  మ‌ణిర‌త్నం, సుభాష్ క‌ర‌ణ్‌, ద‌ర్శ‌క‌త్వం: మ‌ణిర‌త్నం. 

 

- Advertisement -

Related Posts

బంగారు బుల్లోడు రివ్యూ: రొటీన్ ట్రాక్‌లో వెళ్లిన అల్ల‌రోడు..ప్రేక్షకులను మెప్పించడంలో విఫలం

చిత్ర టైటిల్‌ : బంగారు బుల్లోడు నటీనటులు : అల్లరి నరేశ్‌, పూజా జవేరి, తనికెళ్ల భరణి, పొసాని కృష్ణ మరళి, అజయ్ ఘోష్, పృథ్వీ, ప్రవీణ్, ప్రభాస్ శ్రీను,తదితరులు నిర్మాణ సంస్థ :...

ప్రభాస్ స్కై-ఫై.. ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్

యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ప్రభాస్ తో ఒక స్కై ఫై సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు అయితే మామూలుగా లేవు....

మాస్టర్ ఎఫెక్ట్.. రేటు పెంచిన సేతుపతి

మాస్టర్ సినిమాలో నెవర్ బిఫోర్ అనేలా నెగిటివ్ రోల్ లో నటించిన విజయ్ సేతుపతి మళ్ళీ రెమ్యునరేషన్ డోస్ పెంచినట్లు టాక్ వస్తోంది. 96 హిట్టుతో హీరోగా ఏ రేంజ్ లో క్లిక్కయ్యాడో అందరికి తెలిసిందే. అయినా కూడా కేవలం...

మ‌రో క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్ !

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జోరు మాములుగా లేదు. వరుస పెట్టి సినిమాలు ఒప్పేసుకుంటున్నాడు. ముందుగా ‘వకీల్ సాబ్’ సినిమాను కంప్లీట్ చేసాడు. తొలిసారి లాయర్ పాత్రలో పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో యాక్ట్...

Latest News