ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయిన పదం ఏమిటీ అంటే ‘ఫసక్’ . మోహన్ బాబు ఓ ఇంటర్వూలో ‘ఫసక్’ అనే పదం నాటి నుంచీ సోషల్ మీడియాలో ఆ పదం విపరీతంగా ట్రెండింగ్ అవుతోంది. మీమ్స్ అయితే లెక్కాపత్రం లేకుండా వందల్లో వచ్చాయి. మోహన్ బాబు కూడా తను యధాలాపంగా వాడిన పదం ఇంత పాపులర్ అవటం చూసి పండగ చేసుకుంటున్నాని అన్నారు. అయితే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఫసక్ అనే కనపటడం ..ఆ మధ్యన నాగచైతన్యతో సవ్యసాచిలో హీరోయిన్ గా చేసిన నిధి అగర్వాల్ కు డౌట్ వచ్చింది.
దాంతో ఆమె గైస్..ఈ ఫసక్ ఏమిటి..ఎక్కడ చూసినా ఇదే కనిపిస్తోంది. ఈ పదానికి అర్దం తెలియటం లేదు…అంటూ సందేహం వ్యక్తం చేసింది. పాపం చాలా మంది ఆమెకు అసలు ‘ఫసక్’ అనే పదం ఎలా పుట్టిందో..ఎలా ట్రెండ్ అయ్యిందో వివరించే ప్రయత్నం చేసారు కానీ ఆమెకు అర్దమైనట్లు లేదు.
అప్పుడు మన మంచు హీరో మనోజ్ బాబు ఈ విషయం గమనించి “ఫసక్ అనేది చాలా ఎమోషన్ తో కూడిన రియాక్షన్. నా ఇంగ్లీష్ తప్పయితే క్షమించు.. అసలు అర్థమే లేదనుకుంటే క్షమించు.. ఫసాక్!!” అంటూ ఫన్ తో కూడిన ‘ఫసక్’ వివరణ ఇచ్చి ‘ఫసక్’ చేసేసాడు. అప్పుడు నిధి అగర్వాల్ ..హమ్మయ్య…ఇప్పుడు ఆ పదం అర్దమైంది.
Guys.. what is fasak? Somehow I’m not aware of this new lingo.. I keep reading it everywhere
— Nidhhi Agerwal (@AgerwalNidhhi) September 14, 2018
The Original version of “The Fasakk” .
Oke vetu…. ? … povali . @HeroManoj1 @iVishnuManchu pic.twitter.com/eEaTKF4mWv— Prince fan (@Ravianenenu) September 15, 2018