మంచు ఫ్యామిలీతో మెగా హీరో వియ్యం?

పెట్ డాగ్స్ కి పెళ్లి.. బావుంద‌య్యో వియ్యం!

మంచు ఫ్యామిలీ.. మెగా ఫ్యామిలీ స్నేహం గురించి తెలిసిందే. నిప్పు-ఉప్పులా వెంట‌నే కలిసిపోతారు. క‌లిసి ఉన్న‌ట్టే ఉన్నా.. ఇరు కుటుంబాల మ‌ధ్య చిట‌ప‌ట‌లు అప్పుడ‌ప్పుడు బ‌య‌ట‌ప‌డుతూనే ఉన్నా .. మంచు మోహ‌న్ బాబు ఎంతో డిగ్నిటీని మెయింటెయిన్ చేస్తూ మెగా హీరో చిరంజీవితో స‌ర‌దాగా క‌లిసిపోతుంటారు. త‌న స్నేహితుడిగానే చూస్తుంటారు. చిరంజీవి సైతం ఎంతో ఎమోష‌న‌ల్ అయ్యి త‌న స్నేహితుడు మోహన్ బాబుని ప‌బ్లిక్ వేదిక‌ల‌పైనే ముద్దాడేస్తుంటారు. ఆ ఎపిసోడ్స్ సంగ‌తేమో కానీ..

ఇప్పుడు ఏకంగా మంచు ఫ్యామిలీతో మెగా హీరో వియ్యమొందే వ‌ర‌కూ వెళ్లింది సీన్. ఇంత‌కీ ఏం జ‌రిగింది? అంటే మంచు మ‌నోజ్ .. మెగా హీరో సాయి తేజ్ ని వియ్యంకుడు! అంటూ ప్ర‌స్థావించాడు. త‌మ స్నేహం వియ్యం వ‌ర‌కూ వెళ్లింద‌ని స‌ర‌దా వ్యాఖ్య‌లే చేశాడు. దాంతో పాటే ఒక ఫోటోని సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు.

ఈ ఫోటోలో మ‌నోజ్ త‌న పెట్ డాగ్ తో క‌లిసి ఉండ‌గా.. సాయి తేజ్ కూడా ఇంచుమించు అలానే ఉన్న వేరొక పెట్ డాగ్ తో ఫోజిచ్చాడు. “టాంగో – జోయా జంట‌కు డేట్ డే. సామాజిక దూరం పాటిస్తూ.. నాకు మంచి అల్లుడుని ఇచ్చినందుకు నా వియ్యంకుడు సాయి ధరమ్ తేజ్ కు థాంక్స్. త్వరలోనే ముహూర్తలు పెట్టించి శుభలేఖలు వేయిస్తాం“ అంటూ సరదా కామెంట్ చేశాడు. మొత్తానికి పెట్స్ కి పెళ్లి చేసి అయినా ఫ్యామిలీల్ని క‌లుపుకుంటున్నారు మంచిదే! ప్ర‌స్తుతం మ‌నోజ్ `అహం బ్రహ్మాస్మి` అనే చిత్రంతో రీఎంట్రీ ఇస్తుండ‌గా.. సాయి తేజ్ `సోలో బ్ర‌‌తుకే సో బెట‌ర్` అనే చిత్రంలో న‌టిస్తున్నాడు. మ‌హ‌మ్మారీ క్రైసిస్ వ‌ల్ల చిత్రీక‌ర‌ణ‌లు ఆల‌స్య‌మ‌వుతున్నాయి.