ఈ అందగత్తె ఫోజ్ చూసి కేరళ – తెలంగాణా – ఆంధ్ర కుర్రాళ్ళు పిచ్చెక్కిపోతున్నారు..!

malavika mohanan

మాళవిక మోహనన్ అనే హీరోయిన్ మీకు తెలుసా? ఎవరీమె.. ఇప్పటి వరకు ఈమెను చూడలేదు అంటారా? మలయాళం హీరోయిన్. అయితే.. ఇంకా తెలుగు తెరకు ఈ అమ్మడు పరిచయం కాలేదు. కానీ.. ఆమ్మడు అందం చూస్తే ఖచ్చితంగా తెలుగు సినిమాల్లోకి వచ్చి తీరాల్సిందే అంటారు.

Malayalam heroine Malavika Mohanan stunning pose
Malayalam heroine Malavika Mohanan stunning pose

జస్ట్ 27 ఏళ్లే. కానీ.. అప్పటికే మలయాళంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకొని అక్కడి నుంచి మెల్లగా మరో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. అదే కోలీవుడ్. తమిళ్ ఇండస్ట్రీలో కూడా పాపులర్ అవడంతో.. అక్కడి కుర్ర హీరోలంతా మాళవికే హీరోయిన్ గా తమ సినిమాలకు కావాలంటూ పట్టుబడుతున్నారట.

ఇంతకీ ఈ అమ్మడులో ఏముంది అంతగా అంటారా? అందం ఒక్కటే కాదు.. తన కళ్లతో ఎలాంటి భావాలనైనా పలికే సత్తా ఉంది. అందుకే ఈ అమ్మడికి అంత క్రేజ్.

ఇటీవలే ఈ భామ.. తన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక అంతే.. కుర్రకారే కాదు.. సౌత్ ఇండస్ట్రీ మొత్తం షేక్ అయిపోతోంది. ఆ ఫోటో వైరల్ అవుతుండటంతో సౌత్ లో ఉన్న అన్ని వుడ్ ల హీరోలు మాకు ఈ అమ్మడే హీరోయిన్ గా కావాలంటూ పట్టుబడుతున్నారట.

సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన పేటా సినిమా ద్వారా ఈ అమ్మడు తమిళ పరిశ్రమకు పరిచయం కాగా.. ఆ తర్వాత వెంటనే ఈ అమ్మడుకు తమిళంలో ఆఫర్లు వెతుక్కుంటూ వచ్చాయి.

విజయ్ కి జోడిగా మాస్టార్ అనే సినిమాలో ప్రస్తుతం నటిస్తోంది. దానితో పాటు ధనుష్ సరసన మరో సినిమా చేస్తోంది.

ఈ అమ్మడు ఒక్క సౌత్ ఇండస్ట్రీకే పరిమితం కాలేదు. బాలీవుడ్ లోనూ అడుగుపెట్టింది. అక్కడ హిందీలో సిద్ధాంత్ చతుర్వేదికి ఓకే చెప్పేసింది. ఫర్హాన్ అక్తర్ ఈ సినిమా నిర్మాత. ఆ సినిమాతో పాటు మరో సినిమాకు కూడా ఫర్హాన్.. మాళవికను తీసుకున్నట్టు సమాచారం.

మాళవిక టాలీవుడ్ లో కూడా ఇప్పటికే కాలు మోపాల్సిందే కానీ.. కొన్ని పరిస్థితులు అనుకూలించలేదట. లేకపోతే ఇక్కడ ఇప్పటికే పాపులర్ అయి ఉండేది. మొత్తానికి మాళవిక సౌత్ లో ఉన్న అన్ని ఇండస్ట్రీల్లో కాళ్లు మోపుతూ తన సత్తాను చాటుతూ.. అటు బాలీవుడ్ లోనూ తనేంటో నిరూపించుకుంటోంది.