సూపర్ స్టార్ మహేష్ బాబు మరో బిజినెస్ వెంచర్ కు తెర తీసారు. ఏషియన్ ఫిల్మ్స్ సంస్థతో కలిసి ఏఎంబీ సినిమాస్ పేరిట ఓ మల్టీప్లెక్స్‌ను నిర్మించిన సంగతి తెలిసిందే. అక్కడ సినిమా చూడాలని చాలా మంది గత కొద్ది రోజులుగా ఉత్సాహం చూపిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. లేజర్ స్క్రీనింగ్ పనులు ఆలస్యం కావడం వల్ల మల్టీ ఫ్లెక్స్ లాంచింగ్ పెండింగ్‌లో పడింది.
అయితే ఆ పనులన్నీ పూర్తయ్యి… థియోటర్ లాంచింగ్ క్షణాలు దగ్గర కు వచ్చేసాయి. రేపే అంటే ఆదివారమే మల్టిప్లెక్స్ ఓపెన్ కానుంది. ఈ విషయం అఫీషియల్ గా నమ్రత ప్రకటన ద్వారా తెలియచేసింది. గచ్చిబౌలిలో అధునాతన సౌకర్యాలతో ఈ మల్టీప్లెక్స్ నిర్మాణం జరుపుకోగా , ఇందులో మొత్తం 1638 సీటింగ్ కెపాసిటీ తో 7స్క్రీన్స్ అందుబాటులోకి రానున్నాయి.
అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ చిత్రంతోనే మల్టీ ప్లెక్స్‌ని ప్రారంభించాలని అనుకున్నప్పటికి , నిర్మాణం పూర్తి కాకపోవడంతో వాయిదా వేశారు. ఇక నవంబర్ 29న విడుదల కానున్న భారీ బడ్జెట్ చిత్రం 2.0 చిత్రంతో ఏఎంబీ మల్టీప్లెక్స్‌ను ప్రారంభించనున్నారని అన్నారు. కాని అప్పటికి పనులు పూర్తి కాకపోవడంతో రేపు ఉదయం 10గం.లకి మల్టీ ప్లెక్స్‌ని గ్రాండ్‌గా లాంచ్ చేయనున్నారు.
సాయంత్రం ఆరు గంటల తర్వాత నుండి పలు షోస్ ప్రదర్శింపబడనున్నాయి. 2.0 చిత్రంతో పాటు పలు హిందీ సినిమాలని మొదటగా ప్రదర్శించనున్నారుమహేష్ భార్య నమ్రత ఈ మల్టీప్లెక్స్‌కి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేసింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఏఎంబి పేరుతో ఉన్న పాప్‌కార్న్ కప్ ఫోటోని షేర్ చేస్తూ ఏఎంబి సంస్థలో నా ఫస్ట్ పాప్‌కార్న్ అనే కామెంట్ పెట్టింది. అలానే ఏఎంబీ సంస్థకి గుడ్‌లక్ కూడా తెలియజేసింది.