మ‌హేష్ కొత్త టైటిల్‌…?

                                                                        (ధ్యాన్) 

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ కొత్త సినిమా టైటిల్‌, ఫ‌స్ట్ లుక్ ఈ నెల 9న విడుద‌ల కానుంది. ఈ సినిమా టైటిల్ ఏంట‌నే దానిపై చాలా ర‌కాలైన వార్త‌లు వినిపించాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మూడు అక్ష‌రాల‌ను విడుద‌ల చేశారు. అవే ఆర్‌, ఐ, ఎస్‌.. ఈ మూడు అక్ష‌రాల‌ను ఆధారంగా చేసుకుని ఈ సినిమా టైటిల్‌ను రిషి అని ప్ర‌చారం చేస్తున్నారు. ఈ సినిమాలో ఓ షేడ్‌లో మ‌హేశ్ స్టూడెంట్‌గా పెద్ద కంపెనీ సి.ఇ.వోగా క‌న‌ప‌డితే మ‌రో షేడ్‌లో రాయ‌ల‌సీమ ఫ్యాక్ష‌న్ లుక్‌లో క‌న‌ప‌డ‌తార‌ట‌. అల్ల‌రి న‌రేశ్.. మ‌హేశ్ స్నేహితుడి పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. వంశీపైడిప‌ల్లి తెర‌కెక్కిస్తున్న ఈ సినిమాను దిల్‌రాజు, అశ్వ‌నీద్‌, పివిపి నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 5, 2019లో సినిమా విడుద‌ల‌వుతుంది.