మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గారు అంటే అందిరికీ అభిమానమే. మహేష్ కూడా తండ్రి మాట జవదాటడనే పేరు ఉంది. అదే సమయంలో మహేష్ కెరీర్ విషయంలో, నిర్ణయాల్లోనూ ఆయన వేలు ఎప్పుడూ పెట్టరు. చాలా జెంటిల్ గా వ్యవహిస్తూంటారు. చక్కగా రిటైట్మెంట్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో రీసెంట్ గా మహేష్ తన తండ్రిని అడిగి చెప్తా అని చెప్పారంటూ ఓ వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తోంది.
అదేమిటంటే… మహేష్ ని తమ ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో నటించమని బాలయ్య ఫోన్ చేసి మరీ అడిగారట. ఎన్టీఆర్ బయోపిక్ లో కృష్ణగారి పాత్ర ఉందని, ఆ పాత్రకు వేరే నటుడు వేస్తే అంత లుక్ రాదని, మహేష్ చేత వేయిస్తే బాగుంటుందని టీమ్ భావించిందిట. అయితే మహేష్ వంటి బిజీ సూపర్ స్టార్ ని అడిగే ధైర్యం ఎవరికీ లేదు. దాంతో బాలయ్యకు ఈ విషయం చెప్పటం ఆయన అడగంట జరిగిందట. కానీ వెంటనే మహేష్ తన నిర్ణయం యస్ ఆర్ నో అని చెప్పలేదట. మా నాన్నగారిని అడిగి చెప్తానండీ అన్నారట. ఎందుకంటే మీరు అడిగింది నన్ను పాత్ర వేయమని కాదు..నాన్నగారి పాత్రలో నన్ను కనిపించమని అని వినయంగా చెప్పారట.
అయితే మహేష్ ఈ చిత్రంలో నటిస్తాడా లేదా అనేది ప్రక్కన పెడితే…ఈ బయోపిక్ లో కృష్ణ పాత్ర ఎలా ఉండబోతోంది అనేది కాస్త సస్పెన్సే. ఎందుకంటే మొదట్లో కృష్ణ ..ఎన్టీఆర్ కు వీరాభిమాని. ఆ తర్వాత అల్లూరి సీతారామరాజు ఇష్యూ తో విభేదాలు వచ్చాయి. ఆ తర్వాత ఆయన్ని ఎన్టీఆర్ తన పార్టీలోకి ఆహ్వానించటం ,ఆయన కాదనటం చేసారు. అంతేకాకుండా కాంగ్రేస్ లో చేరి ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా ప్రచారం చేసారు. సినిమా లు చేసారు. ఇవన్నీ బయోపిక్ లో ఉండకపోవచ్చు కానీ ..వాటిని ఎలా మేనేజ్ చెయ్యబోతున్నారనేది మాత్రం ఆసక్తికరమే. ఇవన్ని దృష్టిలో పెట్టుకునే మహేష్ అలా తన తండ్రిని అడ్డం పెట్టి మాట్లాడి ఉంటాడంటున్నారు.