‘మహర్షి’కు సూచనలు ఇస్తున్న సితార (ఫొటో)

మహేష్ బాబు కుమార్తె సితార ఎంత క్యూట్ గా ఉంటుందో తెలిసిందే. సితార ఎప్పుడూ తన తండ్రిని సర్పైజ్ చేస్తూనే ఉంటుంది. ఆ చిన్నారి సెట్ కు వచ్చిందంటే సందడే సందడి. ఆమె ముద్దు ముద్దు మాటలకు అందరూ థ్రిల్ అవుతూంటారు.

తాజాగా ఆమె తన తండ్రి నటిస్తున్న ‘మహర్షి’ చిత్రం సెట్ కు వచ్చింది. అక్కడ ఆ పిల్లకు అక్కడ షూట్ చేసిన సీన్స్ చూపించారు. సరాదాగ ఆ చిన్నారి సైతం కొన్ని సూచనలు ఇచ్చిందిట. మరి తల్లి, తండ్రి, తాత అందరూ సినిమా వాళ్లే. సినిమాలపై చిన్నప్పటినుంచే అవగాహన ఉంటుంది. కాబట్టి అందుకు సంభందించిన సూచనలు ఇవ్వటంలో వింతేముంది అంటున్నారు అది చూసిన వాళ్లు.

మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ‘మహర్షి’. పూజా హెగ్డే హీరోయిన్ . అశ్వనీదత్‌, దిల్‌రాజు, పీవీపీ నిర్మాతలు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మార్చి నాటికి సినిమా పూర్తవుతుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలయ్యాయి. హైదరాబాద్‌లో డబ్బింగ్‌ కార్యక్రమం మొదలైపోయింది . అయితే ఈ నేపధ్యంలో రామోజీ ఫిలింసిటీలో ‘మహర్షి’ కోసం ప్రత్యేకంగా ఓ సెట్‌ను తీర్చిదిద్దారు. పల్లెటూరి నేపథ్యంలో సాగే కీలక సన్నివేశాల్ని ఇక్కడే తెరకెక్కించారు.

అమెరికా నుంచి సొంత ఊరు వచ్చి, ఇక్కడి ప్రజల కోసం పాటు పడే యువకుడిగా మహేష్‌ పాత్ర ఉండబోతోందని, స్నేహం, ప్రేమ, త్యాగం.. ఈ అంశాల చుట్టూ ఈ సినిమా సాగనుందని సమాచారం. అల్లరి నరేష్‌ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఏప్రిల్ 25 న విడుదల చేసేందుకు ఫిలిం మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌.