తెలుగు సినిమా రంగం ఇప్పుడు కథలకన్నా కాబినేషన్ మీదనే నడుస్తుందని చెప్పవచ్చు . సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు , సూపర్ ఇమేజ్ వున్న హీరోను ఎవరైతే సెట్ చేసుకుంటారో వారే రేసులో వుంటున్నారు . ఇప్పుడు మైత్రీ మూవీస్ వారు ఇదే చేశారు . రంగస్థలంతో కమర్షియల్ సినిమా స్టామినా ఏమిటో నిరూపించిన సుకుమార్ విపరీతమైన క్రేజ్ లో వున్నాడు . రామచరణ్, సమంత నటించిన ఈ సినిమా 200 కోట్ల రూపాయలను వసూలు చేస్తుందని ఓ అంచనా .
కొరటాల శివతో మహేష్ బాబు చేసిన “భరత్ అనే నేను ” సినిమా సూపర్ హిట్ అయ్యింది . ఈ సినిమా తరువాత తన 25 వ సినిమాకు దర్శకుడుగా వంశీ పైడిపల్లిని ఎంచుకున్నాడు . ఈ సినిమాకు మహర్షి అనే టైటిల్ నిర్ణయించారు . ప్రస్తుతము ఈ సినిమా షూటింగ్ అమెరికాలో జరుగుతుంది . ఈ చిత్రంలో మహేష్ కు జోడిగా పూజా హెగ్డే నటిస్తుంది . ఇందులో మహేష్ ఎంబీఏ స్టూడెంట్ గా నటిస్తున్నాడు .
మొదటినుంచి మహేష్ తన సినిమాలను జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటాడు . ఒక చిత్ర తరువాత మరో చిత్రం ఒప్పుకుంటాడు . అయితే మైత్రీ మూవీస్ వారు సుకుమార్ తో రావడంతో వెంటనే ఒకే చెప్పాడు . ఇది మహేష్ కు 26వ సినిమా. ఇక ఈ సినిమా బడ్జెట్ కూడా ఊహించని విధంగా ఉంటుందని చెబుతున్నారు . దర్శకుడు సుకుమార్ కు రంగస్థలం తరువాత మార్కెట్ బాగా పెరిగిందని అందుకే మహేష్ తాజా సినిమాకు 150 కోట్ల వరకు ఖర్చు పెట్టాలనుకుంటున్నారట .
మహేష్ ఇప్పుడు సినిమాకు 25 వరకు తీసుకుంటున్నాడట . మరి ఈ సినిమాకు మైత్రీ నిర్మాతలు ఎంత ఆఫర్ చేశారో మరి ?
మహేష్ నటించిన చిత్రాలు ఇతర భాష ల్లో కూడా బాగానే వాసులు చేస్తున్నాయి . ఇక హిందీలో లోకి డబ్ చేసినా బిజినెస్ బాగానే జరుగుతుంది . శాటిలైట్ రైట్స్ గురించి చెప్పనవసరం లేదు .
మహేష్ , సుకుమార్ సినిమా ఎలాంటి చరిత్ర సృష్టిస్తుందో ?