మహేష్ కూడా ఓ మాటేసాడు..కానీ ఫలితం లేదు

దివంగత ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ఎన్టీఆర్ కథానాయకుడు’. ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా బుధవారం (జనవరి 9) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్స్ ఆఫీస్ వద్ద మిక్సెడ్ టాక్ సొంతం చేసుకొన్న ఈ చిత్రం కలెక్షన్ పరంగా మొదటి రోజు మంచి ఊపు మీదే ఉంది. ఇక ఈ సినిమాపై ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపించేసారు. తాజాగా ఈ లిస్ట్ లో ప్రిన్స్ మహేశ్ బాబు కూడా చేరిపోయారు. ఈ విషయమై ఆయన ట్వీట్ చేస్తూ..

తెలుగు సినీ పరిశ్రమకు లెజెండ్ అయిన ఎన్టీఆర్‌కు ఈ స్థాయిలో ఘన నివాళి ఇంతవరకు ఎవరూ, ఎప్పుడు ఇవ్వలేదని మహేష్ అన్నారు. ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమా ఆయనకు నిస్సందేహంగా గొప్ప నివాళి అని కొనియాడారు.

‘మహాద్భుతం.. దర్శకుడు క్రిష్ తన కుంచెతో వెండితెర కాన్వాస్‌పై అద్భుతం చేశాడు. మహా నటుడి జీవితం గురించి ప్రపంచానికి తెలియని విషయాలను అందంగా చిత్రీకరించారు. ఆ పాత్రలో బాలకృష్ణ జీవించారు. అన్ని క్యారెక్టర్లనూ నిజ జీవితానికి చాలా దగ్గరగా చూయించారు. బ్రిలియంట్’ అని మహేశ్ బాబు ట్వీట్ చేశారు.

అయితే ఈ ట్వీట్స్ ఏమీ కలెక్షన్స్ పికప్ అవటానికి పనికొచ్చేలా కనపడం లేదు. తెలుగు రెండు రాష్ట్రాల్లోనూ కలెక్షన్స్ డ్రాప్ అవటం మొదలైంది. దాంతో ప్రమోషన్స్ పెంచి ..ఖచ్చితంగా చూడాలి అనిపించేలా టీజర్స్ కట్ చేయాలని యూనిట్ ఫిక్స్ అయ్యిందని తెలుస్తోంది.