మ‌హేశ్ బాబు చేతుల మీదుగా ‘సిల్లీఫెలోస్’ ట్రైల‌ర్ విడుద‌ల‌..

సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు చేతుల మీదుగా సిల్లీఫెలోస్ ట్రైల‌ర్ విడుద‌లైంది. ఈ చిత్రంలో అల్ల‌రి న‌రేష్, సునీల్, చిత్రాశుక్లా, పూర్ణ‌, నందినిరాయ్ ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. భీమినేని శ్రీ‌నివాస్ ఈ చిత్రాన్ని ఆద్యంతం అల‌రించే విధంగా తెర‌కెక్కించారు. ఈ చిత్రంతోనే సునీల్ కమెడియ‌న్ గా రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో కీల‌క‌పాత్ర‌లో న‌టించారు సునీల్. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ చిత్రంలో బ్ర‌హ్మానందం, జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి, పోసాని కృష్ణ‌ముర‌ళి, హేమ లాంటి న‌టులు కూడా స‌హాయ పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. 

శ్రీ‌వ‌సంత్ సిల్లీఫెలోస్ సినిమాకు సంగీతం అందించ‌గా.. అనీష్ త‌రుణ్ కుమార్ సినిమాటోగ్ర‌ఫీ హ్యాండిల్ చేసాడు. బ్లూ ప్లానెట్ ఎంట‌ర్ టైన్మెంట్ ఎల్ఎల్ పి.. మ‌రియు పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్స్ పై కిర‌ణ్ రెడ్డి, భ‌ర‌త్ చౌద‌రి ఈ చిత్రాన్ని నిర్మించారు. టిజి విశ్వ‌ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని స‌మ‌ర్పిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా తమ చిత్ర ట్రైల‌ర్ ను విడుద‌ల చేసిన సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబుకు తమ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. సెప్టెంబ‌ర్ 7న విడుద‌ల కానుంది సిల్లీఫెలోస్. 

 

న‌టీన‌టులు:

అల్ల‌రి న‌రేష్, సునీల్, చిత్రాశుక్లా, పూర్ణ‌, నందినిరాయ్, బ్ర‌హ్మానందం, జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి, పోసాని కృష్ణ‌ముర‌ళి, రాజార‌వీంద్ర‌, చ‌ల‌ప‌తిరావు, అదుర్స్ ర‌ఘు, ఝాన్సీ, హేమ త‌దిత‌రులు

 

సాంకేతిక నిపుణులు:

ద‌ర్శ‌కుడు: భీమినేని శ్రీ‌నివాస్ 

నిర్మాత‌లు: కిర‌ణ్ రెడ్డి, భ‌ర‌త్ చౌద‌రి

సంస్థ‌లు: బ్లూ ప్లానెట్ ఎంట‌ర్ టైన్మెంట్ మ‌రియు పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ

సినిమాటోగ్ర‌ఫీ: అనీష్ త‌రుణ్ కుమార్

ఆర్ట్ డైరెక్ట‌ర్: ఎం కిర‌ణ్ కుమార్ 

సంగీత ద‌ర్శ‌కుడు: శ్రీ‌వ‌సంత్

ఎడిట‌ర్: గౌతంరాజు

పిఆర్ఓ: వ‌ంశీ శేఖ‌ర్