SSMB 28 – షూట్ అప్డేట్..నాన్ స్టాప్ ఏక్షన్ మోడ్ లో మహేష్ బాబు..!

ఇప్పుడు మన టాలీవుడ్ సినిమా దగ్గర భారీ స్థాయి ఏక్షన్ చిత్రంగా తెరకెక్కిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేస్తున్న భారీ చిత్రం కూడా ఒకటి. మహేష్ బాబు కెరీర్ లో 28వ సినిమాగా అలాగే మహేష్ మరియు త్రివిక్రమ్ నుంచి హ్యాట్రిక్ సినిమా ఇది కావడంతో అంచనాలు కూడా అనేక స్థాయిలో ఉన్నాయి.

అయితే ఇప్పుడు ఈ భారీ సినిమా గత కొన్ని రోజులు కితమే షూటింగ్ స్టార్ట్ అవ్వగా ఇప్పుడు ఈ షూటింగ్ పై అయితే మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకి వచ్చింది. ఈ ఫస్ట్ షూటింగ్ నే మహేష్ బాబుతో ఓ అదిరిపోయే ఏక్షన్ సీక్వెన్స్ తో మొదలు పెట్టగ ఈరోజు నుంచి చిత్ర యూనిట్ ప్లేస్ మార్చి ఆర్ ఎఫ్ సి లో స్టార్ట్ చేశారట.

ఇక ఇక్కడ కూడా ఒక మాసివ్ ఏక్షన్ బ్లాక్ తోనే షూటింగ్ ని ప్లాన్ చేయగా మహేష్ బాబు దీని కోసం ఆల్రెడీ చాలా సార్లు రిహార్సల్స్ చేసి రెడీగా ఉన్నాడట. అంతే కాకుండా ఈ సీన్ కూడా థియేటర్స్ లో బ్లాస్టింగ్ లెవెల్లో ఉంటుందని కేజీఎఫ్ ఫేమ్ ఫైట్ మాస్టర్ లు సాలిడ్ గా డిజైన్ చేసారని తెలుస్తుంది.

మొత్తానికి అయితే ఇలా మహేష్ బాబు నాన్ స్టాప్ ఏక్షన్ మోడ్ లో ఉన్నాడు. ఇంకా ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే హారికా హాసిని ఎంటర్టైన్మంట్స్ వారు సుమారు 200 కోట్ల బడ్జెట్ కేటాయించి నెక్స్ట్ లెవెల్లో సినిమాని ప్లాన్ చేస్తున్నారు.