సూపర్ స్టార్ మహేష్ గారాల పట్టీ సితారకు సంబంధించిన ప్రతిదీ ఇన్ స్టా మాధ్యమంలో అప్ డేటెడ్ గానే ఉంటుంది. మామ్ నమ్రత సితార అల్లరి వేషాల్ని రెగ్యులర్ గా అభిమానులకు షేర్ చేస్తుంటారు. ఇప్పటికే ఇన్ స్టాలో సితార ఫోటోలు వీడియోలు వైరల్ అయ్యాయి. అలాగే ఆద్య అండ్ సితార చానెల్ ద్వారా సితార ఇంటర్వ్యూలు అంతర్జాలంలో పాపులరయ్యాయి.
ఇక మామ్ డాడీలతో పోటీపడుతూ ఇన్ స్టా సహా డిజిటల్లో ఫాలోవర్స్ ని సంపాదించుకుంటున్న సితారకు డిజిటల్ ఆర్జనలో బోలెడంత భవిష్యత్ ఉందని అంచనా వేస్తున్నారు. ఇక మహేష్ – నమ్రత బృందం కుటుంబ సమేతంగా వాణిజ్య ప్రకటనల్లో నటించేందుకు ప్రీప్లాన్డ్ గా ఉన్నారు. తద్వారా ఆ కుటుంబానికి ప్రకటనల ఆదాయం అమాంతం పదింతలు అయ్యింది. ఇటీవలే ఫ్యామిలీ ఫ్యామిలీ ఓ వాణిజ్య ప్రకటనలో నటిస్తే అది కాస్తా జోరుగా ఫ్యాన్స్ లోకి దూసుకెళ్లింది.
సితార త్వరలోనే బాలనటిగా ఎంట్రీ ఇచ్చేందుకు ఆస్కారం లేకపోలేదని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. నమ్రత ఇప్పట్లో సితార ఎంట్రీ ఉండదని చెబుతున్నా.. సరైన సమయం వస్తే సితార ఎంట్రీ ఉంటుందని భావిస్తున్నారు. మహేష్ ప్రస్తుతం తన కెరీర్ 27వ చిత్రంలో నటిస్తున్నారు. త్వరలో రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభం కానుందని తెలుస్తోంది.
సితార 1
సితార 2
సితార 3
కుటుంబ సభ్యులతో సితార