నాది ప్రేమ వివాహం కావాలి అనే ఉంది : ప్రభాస్

నాది ప్రేమ వివాహం కావాలి అనే ఉంది : ప్రభాస్

ప్రభాస్ పెళ్లి గురించి ఎప్పటికప్పుడు జాతీయ మీడియాలో కూడా వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ ఒక ఎన్నారై యువతిని వివాహం చేసుకబోతున్నాడని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అలాగే అనుష్కతో ప్రభాస్ ప్రేమలో ఉన్నాడని, వీరిద్దరూ అమెరికాలో కొత్త ఇల్లు కూడా కొనుక్కున్నారని కథనాలు వచ్చాయి. ఆ వార్తలపై ప్రభాస్ తాజాగా స్పందించాడు. అనుష్కతో స్నేహం తప్ప ఇంకేమీ లేదని స్పష్టం చేశాడు.

తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రభాస్ తన పెళ్లి గురించి ఆసక్తికరంగా స్పందించాడు. `పెళ్లి గురించి ఇంకా క్లారిటీ లేదు. జరగాల్సిన సమయంలో నా పెళ్లి కచ్చితంగా జరుగుతుంది. నాది ప్రేమ వివాహం కూడా కావొచ్చ`ని ప్రభాస్ అన్నాడు.అయితే ప్రభాస్ అనుష్క ని వివాహం చేసుకోనున్నాడు అని తెలయాలి అంటే కొద్ది రోజులు ఆగితే కానీ తెలయదు.