ఇండిపెండెన్స్ డే విషెస్ సాధారణంగా ఎలా తెలుపుకుంటారు? ఒక పుష్ప గుచ్చం ఇచ్చి, షేక్ హ్యాండ్ ఇచ్చి, స్కూల్స్ లో అయితే స్వీట్లు, చాక్లెట్లు ఇచ్చి చెబుతారు. సోషల్ మీడియాలో ఫొటోస్, వీడియోస్ తో డిఫరెంట్ గా చెబుతున్నారు. కానీ అందుకు భిన్నంగా లిప్ లాక్ తో ఇండిపెండెన్స్ డే గ్రీటింగ్స్ చెబుతున్నారు ఒక సినిమా బృందం.

“మిస్టేక్” సినిమాలో ఒక లిప్ లాక్ సీన్ పోస్టర్ ని హ్యాపీ ఇండిపెండెన్స్ డే అంటూ ఆ సినిమాలోని నటి యశస్వి ఐషు తన టైం లైన్ లో పోస్ట్ చేసుకుంది. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చూసినవారంతా ఇలా కూడా విషెస్ చెబుతారా అంటూ నోరెళ్లబెడుతున్నారు. ఏదేమైనా ఈ ఫొటోతో ఆ సినిమాకి భలే ప్రమోషన్ దొరికింది. దీనిపై కొందరు పాజిటివ్ గా రెస్పాండ్ అయినా కొందరు మాత్రం నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు.
