నేను అసహ్యంగా ఉంటానని నాకు తెలుసు,మీరు చెప్పక్కర్లేదు

మొత్తానికి గొడవ చిలికి, చిలికి గాలి వాన అయ్యింది. మహేష్ బాబుపై కామెంట్స్ చేసిన మనోజ్ ని మహేష్ ఫ్యాన్స్ ఓ రేంజిలో వేసుకుంటున్నారు. ఆ నేపధ్యంలో ఆయన సోషల్ మీడియా సాక్షిగా సారీ చెప్పారు. అప్పటికి నీ ముఖం అద్దంలో చూసుకో…నువ్వెంత అసహ్యంగా ఉంటావో తెలుసా..నువ్వు వచ్చి మహేష్ నివిమర్శించేటంత గొప్పోడివా…అంటూ మనోజ్ ని అతని కుటుంబాన్ని టార్గెట్ చేయటం  మొదలెట్టారు. ఈ నేపధ్యంలో మనోజ్… ఓ ప్రకటన లాంటిదొకటి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

‘నాకు వచ్చిన కామెంట్స్‌లో చాలా మంది నేను అసహ్యంగా ఉంటానని అంటున్నారు. అలా అంటూ మీ సమయం వృథా చేసుకోకండి. నేను అసహ్యంగా ఉంటానన్న విషయం నాకూ తెలుసు. నిజానిజాలు తెలుసుకోకుండా నోరుపారేసుకోవడం అందరికీ ఓ అలవాటుగా మారిపోయింది.
అన్నారు.

అలాగే అనవసరంగా నా కుటుంబీకులు, స్నేహితులను కూడా టార్గెట్‌ చేస్తున్నారు. మంచో, చెడో నాతోనే నేరుగా మాట్లాడండి. ఈ గొడవలోకి నా కుటుంబీకులను లాగొద్దు. నాపై కామెంట్స్‌ పెట్టిన తొలి రోజుల్లోనే నేను స్పందించి ఉంటే ఇంతదాకా వచ్చేది కాదు. నా మాటలు మిమ్మల్ని బాధించి ఉంటే నన్ను క్షమించండి. మహేష్ బాబుకు‌ కూడా నేను క్షమాపణలు చెప్తున్నాను. మనమంతా మనుషులమే. అందరం తప్పులు చేస్తాం. నేను
ఇంకా వాటి నుంచి నేర్చుకుంటున్నాను’ అన్నారు మనోజ్‌.