సమంత భారీ సినిమా “శాకుంతలం” పై లేటెస్ట్ అప్డేట్స్ ఏమిటంటే.!

సౌత్ ఇండియా సినిమా దగ్గర మాత్రమే కాకుండా ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో కూడా స్టార్ హీరోయిన్ సమంత కూడా ఒకరు. మరి సమంత తన కెరీర్ లో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టాక సమంత అయితే తన కెరీర్ లో మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు.

ఇంకా ఆ తర్వాతే సమంత కూడా భారీ సినిమాలు తన నుంచి అనౌన్స్ చేసింది. అలా చేసిన భారీ చిత్రాల్లో హ్యుజ్ బడ్జెట్ చిత్రం “శాకుంతలం” కూడా ఒకటి. రాజమౌళి కన్నా ముందే మన తెలుగు సినిమాలో హిస్టారికల్ చిత్రాలు భారీ సెట్టింగులు వేసే దర్శకుడుగా గుణశేఖర్ కి మంచి పేరు ఉంది.

మరి తాను చేస్తున్న సినిమానే ఈ “శాకుంతలం”. అయితే ఈ భారీ చిత్రం షూటింగ్ మేకర్స్ ఎప్పుడో మొదలు పెట్టగా షూటింగ్ కూడా ఆల్రెడీ కంప్లీట్ అయ్యినట్టు తెలుస్తుంది. ఇక ఇప్పుడు సినీ వర్గాల నుంచి అయితే ఈ సినిమాపై లేటెస్ట్ అప్డేట్స్ ఏమిటంటే ఇపుడు చిత్ర యూనిట్ శరవేగంగా ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేస్తుండగా..

నెక్స్ట్ ఇదే పనుల్లో ఈ చిత్రంలో భారీ కంప్యూటర్ గ్రాఫిక్స్ పనులు కూడా కంప్లీట్ చేస్తున్నారట. ఇక ఇవి ఒక్కసారి కంప్లీట్ అయితే సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంకా ఈ సినిమాని దిల్ రాజు మరియు గుణశేకర్ లు నిర్మాణం వహిస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.