తాజాగా మళ్ళీ తెలుగు సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లతో అంతా నార్మల్ అయ్యింది. గడిచిన రెండు మూడు వారాల్లో వచ్చిన ఆల్ మోస్ట్ అన్ని సినిమాలు కూడా సక్సెస్ బాట పట్టడం భారీ లాభాలు అందిస్తుండడంతో డిస్ట్రిబ్యూటర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఇప్పుడు లేటెస్ట్ గా భారీ లెవెల్లో లాభాలు అప్పజెప్తున్న సినిమా “కార్తికేయ 2”. హీరో నిఖిల్ మరియు దర్శకుడు చందూ మొండేటి నుంచి వచ్చిన ఈ క్రేజీ సీక్వెల్ ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తుంది. ఒక్క తెలుగులోనే కాకుండా హిందీలో కూడా ఈ సినిమా భారీ సక్సెస్ అందుకోవడంతో జనాలు బారులు తీరుతున్నారు.
ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాపై ఇప్పుడు డిజిటల్ రిలీజ్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ సమాచారం ఇప్పుడు బయటకి వచ్చింది. ఈ చిత్రం రిలీజ్ కి ముందు కానీ సినిమా ప్రదర్శనలో కానీ ఈ చిత్రం ఓటిటి రైట్స్ ఎవరు సొంతం చేసుకున్నారు? ఏ ఓటిటి లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది అనేవి బయటకి రాలేదు.
కానీ ఇపుడు అయితే ఈ సినిమాపై క్లారిటీ బయటకి వచ్చింది. ఈ చిత్రాన్ని ఇండియన్ స్ట్రీమింగ్ సంస్థ జీ 5 వారు సొంతం చేసుకున్నారట. అలాగే సాటిలైట్ హక్కులు కూడా వీరే సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇక దీనితో పాటుగా ఈ చిత్రం కూడా స్టార్ హీరోల సినిమా లానే 50 రోజులు వరకు ఓటిటి లో రిలీజ్ కాదని భోగట్టా..