మాజీ హీరోయిన్ లైలా ఇప్పుడు ఏం చేస్తోందో తెలిస్తే షాక్

“మాఘమాసం ఎప్పుడొస్తుందో…” అంటూ అల్లరల్లరి చేసిన మాజీ హీరోయిన్ లైలా గుర్తుందా…ఆమె ఆ మధ్య వివాహం చేసుకుని సిని కెరీర్ కు బ్రేక్ ఇచ్చింది. అయితే మళ్లీ తర్వాత నేను ఉన్నానంటూ ఇండస్ట్రీకి రావటానికి ప్రయత్నం చేస్తోంది. అప్పటి తన సిని పరిచయాలను తిరగ తోడుతోంది. వాళ్లకు ఫోన్స్ చేసి మాటలు కలుపుతోంది. అవకాసం ఉంటే వాళ్ల ఇళ్లకు వెళ్తోంది. అయితే లైలా మరి పెద్దది అయ్యింది కదా అప్పటిలా హీరోయిన్ పాత్రలు రావు కదా అంటే విలన్ పాత్రలు చేయాలనే సరదా ఉన్నట్లు తేల్చేసింది.

అయితే అందుతున్న సమచారం ప్రకారం లైలా..ఓ సినిమాని డైరక్ట్ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందుకోసం ఆమె నిర్మాతలను కలిసి ఓ స్టోరీలైన్ ఉందని వినమని అడుగుతోందిట. తెలుగులో మహిళా దర్శకురాలిగా లాంచ్ అవ్వాలని ఆమె ఆలోచన అని తెలుస్తోంది. ఈ మేరకు ఆమె ఓ లేడీ ఓరియెంటెడ్ కథ పట్టుకుందని అంటున్నారు. అయితే అది ఎలాంటి కథ అనేది తెలియరాలేదు. స్త్రీ స్వేచ్చా జీవితం గురించి ఉండబోతోందని చెప్పుకుంటున్నారు. అయతే రీసెంట్ గా హైదరాబాద్ కు ఓ ఫంక్షన్ కు వచ్చినామె ఆ విషయం మాత్రం రివీల్ చేయలేదు.

కేవలం సినిమాల్లో కమ్‌బ్యాక్‌ గురించి ఆమె మాట్లాడుతూ – ‘‘సౌత్ స్టేట్స్ నుంచి మళ్లీ చాలా ఆఫర్స్‌ వస్తున్నాయి. కానీ, మంచి రోల్‌తో కమ్‌బ్యాక్‌ అవ్వాలని ఎదురుచూస్తున్నాను. నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్ర అయితే బాగుంటుందని నా ఆలోచన. త్వరలో డైరెక్షన్‌ కూడా చేయాలనే ఉద్దేశం ఉంది’’ అని పేర్కొన్నారు.

ఇక లైలా గతంలో ‘ఎగిరే పావురమా, ఉగాది, పెళ్లి చేసుకుందాం, ఖైదీగారు, పవిత్రప్రేమ, శివ పుత్రుడు’ వంటి చిత్రాలతో నటిగా మంచి ప్రూవ్ అయ్యింది. 2006లో బిజినెస్ మ్యాన్ మెహ్‌దిన్‌ని పెళ్లి చేసుకొని సినిమాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టారామె. అయితే, 12 సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్లీ సినిమాల్లోకి కమ్‌బ్యాక్‌ ఇవ్వాలనుకుంటోంది. బెస్టాఫ్ లక్ లైలా.