ప్రత్యేక ఫ్లైట్‌లో ఉదయ్‌పూర్‌కు పెళ్లి బ‌ృందం … నిహారికతో పెళ్లికొడుకు సెల్ఫీ !

మెగా ఫ్యామిలీలో పెళ్లి వేడుక జరుగుతోన్న సంగతి తెలిసిందే. మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక పెళ్లి రాజస్థాన్‌లో జరగనున్న నేపథ్యంలో కుటుంబ సభ్యులంతా సందడి చేస్తున్నారు.

నిహారిక పెళ్లి పనులకు చెందిన ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియా లో వైరల్‌ అవుతున్నాయి. ఇకపోతే ఈ రోజు పెళ్లి కోసం మెగా బ్రదర్ నాగబాబు ఫ్యామిలీ అంతా కలిసి ఓ ప్రత్యేక ఫ్లైట్‌లో ఉదయ్‌పూర్ బయలుదేరారు.

ఈ సందర్భంగా పెళ్లికొడుకు సెల్ఫీ తీశాడు. వరుణ్ తేజ్, నాగ బాబు, పద్మజ దంపతులుతో పాటు కొత్త జంట నిహారిక, చైతన్య ఈ విమానంలో ఉన్నారు. చైతన్య తల్లిదండ్రులు ఈ చార్టెడ్ విమానంలో కనిపించారు. కుటుంబసభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో జొన్నలగడ్డ చైతన్యను నిహారిక పెళ్లాడనున్న విషయం తెలిసిందే. ఈ నెల 9న వీరి పెళ్లి వేడుక జరగనుంది. అనంతరం హైదరాబాద్‌ లో విందు ఉంటుంది.

ఇక మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ సహా మొత్తం మెగా కుటుంబం ఈ వివాహానికి హాజరుకానుంది. మెగా హీరోలంతా పెళ్లి వేడుక ఆద్యంతం సందడి చేయనున్నారు. షూటింగులకు బ్రేక్ ఇచ్చి వేడుకను వీక్షించనున్నారు. డిసెంబ‌ర్ 9న పెళ్లి పూర్తైన త‌ర్వాత డిసెంబ‌ర్ 11న జేఆర్‌సీ క‌న్వెన్ష‌న్‌లో రిసెప్ష‌న్ గ్రాండ్‌గా నిర్వ‌హించ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి సినీ, రాజ‌కీయ, టీవీ ప్ర‌ముఖులు హాజ‌రు కానున్నారు.