పబ్లిసిటీలోనూ ‘కొబ్బరిమట్ట’ భలే కామెడీ
ఏ విషయాన్ని అయినా సూటిగా , సుత్తిలేకుండా, సెటైర్ చేస్తూ చెప్తే నవ్వుకూంటూ గుర్తు పెట్టుకుంటారు. ఇప్పుడదే పని కొబ్బరి మట్ట యూనిట్ చేస్తోంది. సినిమాని వ్యంగ్యంగా రూపొందించిన ఈ టీమ్ ఇప్పుడు పబ్లిసిటీని కూడా అదే విధంగా చేస్తోంది. ఇప్పుటివరకూ తెలుగులోలేని విధంగా 50 గంటలు పోస్టర్ ని విడుదల చేసింది.
ఇక హృదయకాలేయం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యిన సంపూ .. అ తర్వాత రెండు మూడు సినిమాలు చేసిన ఆడలేదు. దీనితో హృదయకాలేయం టీమ్ మళ్ళీ కొబ్బరిమట్ట సినిమాతో సంపూని రీలాంచ్ చేస్తున్నట్లుగా ప్రేక్షకుల ముదుకు తీసుకు వచ్చింది . నిజానికి సినిమా ఎప్పుడో మొదలయింది కానీ కొన్ని కారణాల వల్ల సినిమా విడుదలకి నోచుకోలేదు .ఎన్నో అడ్డంకుల మధ్య ఈ శనివారం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది .
మార్నింగ్ షో నుంచే ఈ చిత్రానికి హిట్ రిపోర్ట్ వచ్చింది. ఆ చిత్రంలో తనదైన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ తో బాగానే నవ్వించాడు సంపూ.. దానికి తగినట్లే చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్ లు కనపడుతున్నాయి. గీతా ఆర్ట్స్ అండతో వచ్చిన ఈ చిత్రం హిట్ టాక్ తో శాటిలైట్, డబ్బింగ్ రైట్స్ అమ్ముడైపోయినట్లు తెలుస్తోంది. దాంతో పెట్టిన పెట్టుబడి రికవరీ అయ్యిందని, ఫస్ట్ వీక్ లో వచ్చేది ఇంక లాభమే అంటున్నారు. ఈ నేపధ్యంలో నైజాంలో కూడా స్క్రీన్స్ పెంచుతున్నారు.
ఈ సినిమా క్రెడిట్ మొత్తం సంపూకి చెందుతుంది. సినిమా మొత్తాన్ని సంపూ తన భుజాల పైన వేసుకొని నడిపించాడు . పెదరాయుడు , ఆండ్రాయిడ్ ,పాపారాయుడు అనే మూడు పాత్రల్లో సంపూ నటన చించి ఆరేసాడు . చాలా సీన్స్ లో తనదైన విలక్షణమైన డైలాగు డెలవరీతో వావ్ అనిపిస్తాడు. ఇక షకీలా ,కత్తి మహేష్ మరికొందరు నటినటులు కూడా బాగా చేసారు.